నింగి, నేలకు పెండ్లి

నింగి, నేలకు పెండ్లి

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

Rainbow

నింగికి నేలకున్ నడుమ నీరద పంక్తులు మధ్య వర్తులై
చెంగులు కూర్చి రెంటికిని చేయు వివాహము వర్ష మన్న; ఆ
మంగళ వేళలో నభము మంగళ సూత్రము నింద్ర చాపమున్
’ బంగరు చేలు ’ చేలమున భాసిలు భూమికి కట్టు ప్రేమతో !

త్రేతా యుగాదిగ పదే
సీతా రాములకు పెండ్లి చేసిన యట్లున్ –
భూతల, మాకాశములకు
నీ తీరుగ పెండ్లి జరుగు నెన్నో మారుల్ !

విచ్చి కనులు పెండ్లి వీక్షించుచుందురు
తరతరాల ప్రజలు తన్మయమున –
అవని కడుపు పండ నాశీర్వదింతురు
మరల మరల పెండ్లి జరిగినంత –

వాన కాలమందు పంటలెన్నో పండి
హరిత వర్ణ మవని నావరించు –
కాలమట్లు ’ నిత్య కల్యాణము మరియు
పచ్చ తోరణము ’ గ వరలుచుండు !

—— *** —–

rainy day

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  సెప్టెం 11, 2009 @ 20:40:27

  మీ మొదటి పద్యానికి నా అభినందనలు. రెండో పద్యం మొదటిలైను సరిగా అర్థం కాలేదు . వివరించగలరు . పదే అనేమాట అర్థం కాలేదు.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  సెప్టెం 11, 2009 @ 22:48:57

  నరసింహారావు గారికి ధన్యవాదాలు !
  ’ పదే ’ అన్నది ముహురర్థకంగా ప్రయోగించాను.
  ” త్రేతా యుగాది, మాటికి ” అని కూడా మార్చుకోవచ్చు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: