కన్నీటి రుచి తెలుసా ?

కన్నీటి రుచి తెలుసా ?

( విషాద గీతం )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

man crying

కన్నీటి రుచి తెలుసా ?

కనబడని ఓ మనసా !

వలపు రుచి నీకు తెలుసా ?

కుమిలి కుమిలి వగచే దినుసా !      || కన్నీటి ||


ప్రేమకూ రంగుంటుంది –
ఎర్ర గులాబీని అడుగు !
రక్తానికి రంగుంటుంది –
గుచ్చుకొన్న ముల్లు నడుగు !         || కన్నీటి ||

పై పై అందాలు చూసి
ప్రణయాన్ని ఒలకబోయకు !
పాషాణ హృదయాలుంటాయ్ –
పని గట్టుక వెలికి తీయకు !              || కన్నీటి ||

ఫలించిందా వలపు –
పరిమళాలనే చిలుకు !
విఫలమయిందా వలపు –
వల్లకాడు వాసన గొలుపు !               || కన్నీటి ||

—– *** —–

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. subhadra
  సెప్టెం 07, 2009 @ 19:01:20

  very very touching..
  prema ki ramgumtundi,
  erra gulaabhi nadugu,
  raktaniki ramgu untumdi,
  guchchukunna mullunu adugu..
  these are too good.

  స్పందించండి

 2. విశ్వ ప్రేమికుడు
  సెప్టెం 07, 2009 @ 21:11:17

  ప్రేమ రుచిని చూపించారు…

  కవిత బాగుంది 🙂

  స్పందించండి

 3. padmarpita
  సెప్టెం 07, 2009 @ 23:37:44

  కన్నీటి రుచి ఏమోకానీ!!!
  ప్రేమకవిత రుచి చూపించారు!!!!

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 08, 2009 @ 06:47:50

  సుభద్ర గారికి,
  విశ్వ ప్రేమికుడు గారికి,
  పద్మార్పిత గారికి –
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: