శ్మశాన వైరాగ్యము

శ్మశాన వైరాగ్యము

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

TL032881

“ఎంత విమోహ జీవనము ! ఎవ్వరి కెవ్వరు ? దేని కేది ? ఈ

వింత జగమ్ములో తుదకు వీడును సర్వము మాయ మాత్రమై –

ఇంతటి దానికై జనులదేటికి చింతిలుచుంద్రు మూర్ఖులై ?

కాంతయు, కాసులున్ కడకు కాటికి తోడుగ రావు కాదొకో ?


బ్రతికినయన్నినాళ్ళు నిదె పాడు శరీరము దుఃఖితంబగున్ –

సతి, సుత, బంధు, మిత్రులని, సంపద, భూమి, గృహమ్ములంచు – నీ

చితి నిటు కాలువేళ నవి చెంతకు చేరునె ? తోడు వచ్చునే ?

సుతులును, చుట్టముల్ నిలిచి చూచెద రామడ దూరమందునన్ !


నేడుంగల్గియు రేపు లేని దొకటే – నిర్భాగ్యమౌ భాగ్యమీ

మూడే నాళుల జీవితమ్ము ! మరి వ్యామోహం బదింకేలనో ?

వాడున్, వీడని ద్వేష, మోహముల, దుర్వ్యాపారముల్ మానుచున్,

పాడిన్ జీవన మార్గమందు చనుచున్, ప్రాణంబు వీడన్ వలెన్ ! ” –


చచ్చిన యట్టివాని కడ సారిగ చూడగ వచ్చినప్పుడున్ –

పిచ్చి జనంబు కిట్టులనిపించు – శ్మశానములో నిమేషమున్ ! –

వచ్చియు రాని అశ్రువుల వారలు, వీరలు చూడ కార్చి, పై

వచ్చిన దారిలోన చని, వారది చిత్రము ! విస్మరింతురే !


—- *** —-

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. సురేష్ బాబు
  సెప్టెం 05, 2009 @ 19:47:15

  పద్యాలు బాగున్నాయండీ. బాగా చెప్పినారు.

  స్పందించండి

 2. నరసింహారావు మల్లిన
  సెప్టెం 05, 2009 @ 21:47:07

  చాలా బాగున్నాయండి.
  యక్షప్రశ్నల్లో ధర్మరాజుని యక్షుడు “మానుషుండగు నాతఁ డేదానఁ జెపుమ ” అని అడిగినదానికి ధర్మరాజు “మృత్యుభయసంగతి నాతఁడు మానుషుం డగున్” అని జవాబిస్తాడు. అంటే మనిషికి ఈ మనుష్యత్వమనేది ఈ మృత్యుభయం వల్లనే కలుగుతుందనుకుంటా.

  స్పందించండి

 3. padmarpita
  సెప్టెం 05, 2009 @ 22:29:53

  శ్మశాన వైరాగ్యాన్ని కూడా ఎంతబాగా చెప్పగలరు మీరు!

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 06, 2009 @ 05:22:22

  సురేశ్ బాబు గారికి,
  మల్లిన నరసింహారావు గారికి,
  పద్మార్పిత గారికి –
  అనేకానేక ధన్యవాదాలు

  స్పందించండి

 5. భాస్కర రామిరెడ్డి
  సెప్టెం 06, 2009 @ 10:32:20

  అత్యంత సహజంగా వున్నాయి డా| ఫణీంద్రగారు. పదాలు ఎంత చక్కగా వొదిగాయో.. అవి తప్ప అక్కడ ఇంకేమీ బాగుండనట్టు అద్భుతంగా వున్నాయి.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  సెప్టెం 06, 2009 @ 13:35:07

  బ్లాగ్ ’ హార ’ గళ ధారి
  భాస్కర రామిరెడ్డి గారికి
  అనేక ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: