అమ్మా !

ఈ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి. మా అమ్మ పరమపదించి నేటికి రెండేళ్ళు పూర్తయ్యాయి.

నవ మాసాలు మోసి,
కని, కని పెట్టుకొని,
పెంచి, పెద్ద చేసి,
బిడ్డ ఎదిగి ఏం సాధించినా తానే కొండెక్కినంత సంబరపడిపోయే –
ఎంత ఎదిగిన బిడ్డడైనా ఎంత చిన్న కష్టం వచ్చినా తానే పాతాళానికి జారినంత బాధపడిపోయే –

అమ్మకు …

ఏ బిడ్డడయినా
ఏమివ్వగలడు ?
ఎంతిచ్చి ఋణం తీర్చుకోగలడు ?

కానీ …
డా. పోరెడ్డి రంగయ్య ( నల్లగొండ జిల్లావాసి ) కేవలం తన మాతృ మూర్తికే గాక 172 మంది కవులు తమ మాతృ మూర్తులకు కవితా నీరాజనాలను సమర్పించుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన
” మా అమ్మ ” అన్న గ్రంథంలో ఆంధ్ర దేశంలోని ప్రముఖ కవులందరూ తమ తమ మాతృ మూర్తులపై వ్రాసిన కవితలను పొందుపరిచి, ఎనలేని పుణ్య ఫలాన్ని సంపాదించుకొన్నారు.

Image0762

ఆ గ్రంథంలో మా అమ్మపై నేను వ్రాసిన పద్యాలు …

అమ్మా !

* కన్నది ఆదిగా, ఎవరు కన్పడినన్ వివరించినావు – ” నా

పున్నమి నాడు పుట్టిన సుపుత్రుడు వీ ” డని ! ఎంతొ మోదమున్

కన్నుల వెల్గ చెప్పితివి – కాగ మెకానిక లింజనీరునున్,

మన్నన లొంద నే కవిగ, మాటికి నద్దియె ప్రస్తుతించుచున్ !


* సుకుమారుడు కష్టమ్ము

న్నొకింత ఓపడని, విఫలమొందిన; గెలువన్,

సకల సమర్థుడని పలుక –

అకళంకము నీదు ప్రేమయని తెలిసెనులే !


* నీ యారోగ్యము క్షీణమైన దెపుడో ! నీ వెట్టులో ఐననున్

చేయంబూనితి వంట ! వేరెవరికిన్ చేయూని వడ్డింపకే,

నా యొక్కండున కేలొ జాలి, దయ మిన్నంటంగ, కంచాన ఆ

ప్యాయంబొప్పగ నుంచి చేతికిడినా వన్నమ్మ దే నెర్గుదున్ !


* అమ్మా ! నీవు ముదంబు నొందితివి నేనానాడు ’ పీ. హెచ్ డి. సీట్ ’

సమ్మానంబుగ పొందినంత – మరి యే శాపంబొ ? లేవైతివే –

ఇమ్మై పూర్తయి, ’ డాక్టరేటు ’ పదమే ఏ నొందు నీ వేళలో !

చెమ్మే నిండెను నాదు కన్నులను, నా చెంతింక నీ లేమిచేన్ !


* ” అమ్మా ! ఎటులున్నది ? ” యన –

అమ్మోమున హాస మొల్కి, ” అటులే ! ” యను నీ

కమ్మని కంఠ స్వరమే

చిమ్మని చీకట్ల నెటకొ చేరిన దయ్యో !

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. rahamthulla
  అక్టో 07, 2009 @ 11:50:57

  అమ్మ మీద 172 మంది కవులు రాసిన అభిప్రాయాలు బ్లాగ్ లో ఉంచండి

  స్పందించండి

 2. డా || ఆచార్య ఫణీంద్ర
  అక్టో 12, 2009 @ 09:50:03

  రహమతుల్లా గారు !
  ఆ కవితలన్నీ బ్లాగులో ఉంచడం చాలా కష్టమండీ – అది 300 పేజీల ఉద్గ్రంథం !
  పైగా copy right ధర్మాన్ని అతిక్రమించడం నాకు మనస్కరించదు.
  మీకు ఆసక్తి ఉంటే, ఈ దిగువ చిరునామా నుండి గ్రంథాన్ని ( మూల్యం చెల్లించి ) తెప్పించుకోండి.
  Price : Rs. 250/-

  Address:
  Mrs. Poreddy Rajeshwari
  C/O Dr. Poreddy Rangaiah
  Adarsha nagar, Near Bus stand,
  Aleru ( Nalgonda Dist. ) – 508101
  Mobile No. : 9948049864

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: