వరాహ శతకము – 4

70th_birthday_number_seventy_sticker-p217219051090451728tdcj_313

ఇది నా 70వ టపా

వరాహ శతకము

( నాలుగవ భాగము )

రచన : ’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

varaha1

సింహ ముఖుండునైన నరసింహ పరాత్పరు డాహ్వయంబునన్

’సింహము’ జంతు నామమది చేరిన చాలక, తృప్తి లేక, ఆ

’సింహము’ కన్న ముందు జతచేర్చియు నీ తిరునామధేయమున్

సింహగిరిన్ ’వరాహ నరసింహు’ డయెన్ గద ఓ వరాహమా!   …   31


అగణిత తారకా గణిత మధ్యయనం బొనరించి, ఖ్యాతినిన్

యుగముల పూర్వమెట్లు భరతోర్వికి గూర్చె ఖగో శాస్త్ర భ

వ్య గురుడు శ్రీ వరాహ మిహిరాఖ్యు డటన్నను – నీదు నామమే

తగిలెను ముందు నాతనికి – దాని ఫలమ్మె గదా! వరాహమా!   …   32


ఇంతటి పూర్వ సంస్కృతిని, ఇంతటి ఉన్నత వంశ కీర్తినిన్

సాంతము విస్మరించుచు, నశౌచము మేయుచు, ’మోరి’ గుంటలో

సుంత వివేకమున్ కలుగజూపక పొర్లిన ఏవగింపరే?

చెంతకు చేరి నిన్ను ప్రజ చేతురె ముద్దు? అయో వరాహమా!   …   33


భాషలయందు ద్వేషయుత భావము దెల్పగ మానవాళికిన్

దూషణ శబ్ద జాలములు తోచవు – కల్గియు వేన వేలునున్!

రోషము నీకు గల్గగ, విరోధుల బూనియు నీదు పేరుతో

దూషణ సల్పుచుందు – రది దోష మటందువె? ఓ వరాహమా!   …   34


ఇంతగ ఏహ్య భావనము నెల్లరి మానసమందు నిండుచో –

అంతయు నీ స్వయంకృతమె! అన్యుల నేమని లాభమేమి? నే

చింతిలుచుందు మా యువత చేష్టలు చూడగ – విస్మరించి భా

స్వంత సుసంస్కృతిట్లు, దిగజారుట నీవలె – ఓ వరాహమా!   …   35


తేటగనున్న నీట నిను తెచ్చియు స్నానము పోసి, అందమున్

చాట నలంకరించి, వెదజల్ల సువాసన ’సెంటు’ పూసినన్ –

మాటికి ’మోరి’ బొర్లుటను మానవు! ” పంది యదేమెరుంగు ప

న్నీటి సువాసన ” న్న నుడి నిష్ఠుర సత్యమె – ఓ వరాహమా!   …   36


తప్పును చేయు టెవ్వరికి తప్పదు _ సత్యము లోకమందునన్!

తప్పు నెరుంగ మానవులు,తప్పక మానగ పూనుకోవలెన్!

తప్పని యెంచి కూడ అదె తప్పును చేయుట ఫంకమందు నీ

వెప్పటి కట్లె మాటికిని ఈదుటె గాదటె? ఓ వరాహమా!   …   37


ఈ నరజాతి బుద్ధి, మరి ఏమనుకోకుము – నీదు బుద్ధియున్,

కానగ నొక్క రీతిగనె కన్పడుచుండును! పాడు బుద్ధులన్

మానెదమంచు నప్పటికి మానసమందు తలంచి గూడ, ఆ

పై నిక సిగ్గు వీడి, అదె పద్ధతి సాగుదురే! వరాహమా!   …   38


కొందరు మూడు ప్రొద్దులెది కోరిన నద్ది భుజించి, స్థూలమౌ

బొందిని పొంది, కార్యమెది పూనరు – చేయరు – అట్టి వారలన్

” పందుల మాదిరిన్ బలుపు పట్టి ” రటంచును తూలనాడ – వి

న్నందుకు నీ మనంబుకెటు లార్తియె గల్గునొ? ఓ వరాహమా!   …   39


ఐనను నీకు మానసమటన్నది యున్నదొ, లేదొ గాని – ఆ

జ్ఞానము నాకు లేదు! ఒక సత్యము మాత్ర మెరుంగుదేను – నీ

మేనిని ఎండ వానలును మీద పడన్ చలనమ్ము శూన్యమే!

కానగ మాదు నేతలకు కల్గినదీ గుణమో వరాహమా!   …   40


ఆశలు రేపి, మాదు విలువైన మహత్తరమైన ’ఓటు’లన్

రాశుల కొల్ది కొల్లగొని, రాజ సుఖంబుల దేలుచుండి, ఏ

కోశమునందు మా కొరకు కొంతయునైన శ్రమింపబోడు! నీ

’రాశి’యు, మాదు నేత ’గ్రహ రాశి’యు నొక్కటె! ఓ వరాహమా!   …   41


ఎంతయు తిట్టిపోసినను ఒకించుక గూడ చలించబోడు – ని

శ్చింతగ కాలమున్ గడుపు చీమయు కుట్టని యట్టులింక! ఆ

సాంతము నైదు వర్షములు సాగిన పిమ్మట యంత వచ్చి, ఓ

ట్లింతయు సిగ్గు లేక, మరి ఇమ్మని వేడునులే వరాహమా!   …   42

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. జిగురు సత్యనారాయణ
  ఆగ 24, 2009 @ 23:40:03

  ఆచార్య గారు,
  చక్కటి శతకాన్ని అందిస్తున్నందుకు ధన్యవాద పూర్వక అభినందనలు.

  అసందర్భము అనుకోక పోతె ప్రస్తుత “స్వైన్-ఫ్లూ” గురించి…

  కొందరు నీదు మాంసమును కోరిక తీరగ మెక్కనెంచి ని
  ర్బంధనఁజేసి నిన్ను పలు పాట్లకు త్రోయగ బోనులందునన్
  పందుల జబ్బు లోకమున పాకెను నేడిక “స్వైను-ఫ్లూ”యనన్
  మందులు కూడ లేవు, మరి మార్కొన దానిని ఓ వరాహమా!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఆగ 25, 2009 @ 18:43:15

  సత్యనారాయణ గారు!
  శతక పద్యాలు నచ్చినందుకు ధన్యవాదాలు.
  మీ పద్యం బాగుంది. అందులో మీరు పేర్కొన్న అంశాలే కాక, పందికి సంబంధించిన ఏ అంశాన్ని వదలకుండా పద్యాలు వ్రాసాను. అవన్నీ ముందు ముందు వస్తాయి. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తుండండి.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: