గజ ముఖ !

ganapati

భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్

నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ

బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్

గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!

విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ

’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. ధరణీ రాయ్ చౌదరి
  ఆగ 22, 2009 @ 18:37:45

  వినాయక చవితి శుభాకాంక్షలు !

  స్పందించండి

 2. ఉష
  ఆగ 22, 2009 @ 18:45:52

  ప్రియమార తనయునిగా తల్లితండ్రులయందు, మక్కువగా మూషికవాహనధారియై ముల్లోకాల్లోనూ మెసిలే స్వామికి వందనం. మీకు కూడా ’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు ! – మరువం ఉష

  స్పందించండి

 3. చిలమకూరు విజయమోహన్
  ఆగ 22, 2009 @ 19:16:20

  గురువుగారి కుటుంబానికి ’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !

  స్పందించండి

 4. నరసింహారావు మల్లిన
  ఆగ 22, 2009 @ 22:02:25

  వినాయక చవితి శుభాకాంక్షలు.

  స్పందించండి

 5. జిగురు సత్యనారాయణ
  ఆగ 22, 2009 @ 22:30:59

  వినాయకుని భుజానికి ఉన్న పాము, వినాయకుని తొండాన్ని చూసి మరో పాము అని అనుకొని దెగ్గరైతే, అది చూసి గణపతి ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడా!! బాగు! బాగు!
  వినాయక చవితి శుభాకాంక్షలు !

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 23, 2009 @ 08:54:45

  ధరణీ రాయ్ చౌదరి గారికి,
  మరువం ’ఉష’ గారికి,
  చిలమకూరు విజయమోహన్ గారికి,
  మల్లిన నరసింహారావు గారికి ….
  ధన్యవాదాలు !
  మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వినాయక చతుర్థి శుభాభినందనలు !

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 23, 2009 @ 09:09:18

  జిగురు సత్యనారాయణ గారు !
  అల్లసాని పెద్దన కవి ’ మను చరిత్రం ’ లో వ్రాసిన ” అంకము జేరి …” అన్న పద్యం ప్రేరణతో రచించిన పద్యం అది.
  పెద్దన వలె మనం కూడ మంచి భావుకతతో వినాయకునిపై ఒక మంచి స్తుతి పద్యం వ్రాయాలన్న ప్రయత్నంగా వెలసిన ఆ పద్యం నాకెంతో ఆత్మ తృప్తినిచ్చింది. పద్యంలోని స్వారస్యాన్ని గమనించినందుకు మీకు నా ధన్యవాదాలు.
  మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ వినాయకుని విశేష కరుణా కటాక్ష వీక్షణ మహద్భాగ్యం సంప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నాను.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: