విషాద భాష

విషాద భాష

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

Crying man

నా గళం ఒక నిశ్శబ్ద నిగళం

మాట పెకలనీయదు –

గుడిలో మూగి ముద్దలా కూర్చొనే

దేవుడనే దొంగ

నా స్వర పేటికను కబళించాడు !

నా మనసేమో వసపిట్ట

మాట్లాడుతూనే ఉంటుంది.

అందరికీ అన్నీ ఇచ్చే

ఆ భగవంతుడు నాకు మాత్రం

అనుభూతులను అధికంగా ఇచ్చాడు.

అనువదించే స్వరాన్ని మాత్రం దోచేసాడు.

అయితే ఏం ?

నాకు మంచే జరిగింది –

వాడి మీద, వీడి మీద

నోరు పారేసుకోనక్కర లేదు –

ఎవరేం మాట్లాడించినా

అపుడే పూచిన మల్లె పూవులా

మంద హాసమే నా సమాధానం !

’ మూగి పీనుగ ’ అని ఎవరైనా

కసరుకొంటే మాత్రం

నా కళ్ళు మాట్లాడుతాయి –

అశ్రు కణ ప్రవాహ

విషాద భాషలో !

— *** —

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఉష
  ఆగ 08, 2009 @ 09:13:49

  గుండెపిండేంత విషాదం గుప్పిడన్ని పలుకుల్లో నింపి వొంపేసారు. మూగి ఆర్తి మాటపోటు వచ్చేట్లు చేసింది. నా మాట కూడా కలం విడిచి రానంటుంది. మీ కవనం దిగులు దేవేరి కంఠహారం మాదిరిగా వుంది.

  స్పందించండి

 2. నరసింహా రావు మల్లిన
  ఆగ 08, 2009 @ 11:47:58

  ఎవరేం మాట్లాడించినా
  అపుడే పూచిన మల్లె పూవులా
  మంద హాసమే నా సమాధానం !
  ’ మూగి పీనుగ ’ అని ఎవరైనా
  కసరుకొంటే మాత్రం
  నా కళ్ళు మాట్లాడుతాయి –
  అశ్రు కణ ప్రవాహ
  విషాద భాషలో

  మీ భావ సంపదని మెచ్చుకోడానికి మాటలు రావటం లేదు. అందుకే మీ మాటల్నే కాపీ చేసి మెచ్చుకుంటున్నాం. చాలా బాగుందండీ. అభినందనలనందుకోండి.

  స్పందించండి

 3. padmarpita
  ఆగ 08, 2009 @ 12:43:36

  ఏది వ్రాయాలన్నా మీకు మీరేసాటి!!

  స్పందించండి

 4. Sree
  ఆగ 08, 2009 @ 14:12:00

  “వాడి మీద, వీడి మీద
  నోరు పారేసుకోనక్కర లేదు –
  ఎవరేం మాట్లాడించినా
  అపుడే పూచిన మల్లె పూవులా”

  కష్టంలో సుఖాన్ని, దుఃఖంలో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదేనేమో.. హృద్యంగా ఉంది..!

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఆగ 08, 2009 @ 21:00:13

  ఉష గారు !
  నరసింహారావు గారు !
  శ్రీ గారు !
  కవిత మిమ్మల్ని ఇంతగా కదిలించినందుకు
  కవిగా అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని పొందుతున్నాను.
  మీకు నా హృదయాంజలులు !

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఆగ 08, 2009 @ 21:07:09

  పద్మార్పిత గారు !
  నాదేముందండి ! అది సరస్వతీ మాత కటాక్ష వైభవ విశేషం !
  మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాంజలి !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: