ఓ ప్రియమైన స్నేహితుడా !

ఓ ప్రియమైన స్నేహితుడా !

( గీతం )

రచన : డా.ఆచార్య ఫణీంద్ర

kara chalanam

నీ హృదయంలో నా స్వప్నాలు

నెలకొని ఉన్నాయి –

నా హృదయంలో నీ భావాలు

బలపడి ఉన్నాయి –

కళ్ళు నాలుగైనా, చూసే

దృశ్యమొకటేలే !

కాళ్ళు నాలుగైనా, చేరే

గమ్యమొకటేలే !

ఓ ప్రియమైన స్నేహితుడా !

నువ్వు, నేను – పాలు, మీగడ !     || ఓ ప్రియమైన ||


పై పై మెరుగుల బహుమతి కాదు

స్నేహమంటే –

అవసర పూర్తి సాయం కాదు

స్నేహమంటే –

ఒకరి కోసం ఒకరు గడిపే

జీవనం – స్నేహం !

ఒకరి కోసం ఒకరు చేసే

భావనం – స్నేహం !

ఓ ప్రియమైన స్నేహితుడా !

నువ్వు, నేను – పాలు, మీగడ !     || ఓ ప్రియమైన ||


చేయి, చేయి కలిపి తిరిగితే

స్నేహమైపోదు –

మాట, మాట కలిపి నవ్వితే

స్నేహమైపోదు –

ఒకరి సౌఖ్యం కోసం ఒకరు

కష్ట పడుటే స్నేహం !

ఒకరి కష్టం ఒకరు చేకొని

సుఖం పంచుట స్నేహం !

ఓ ప్రియమైన స్నేహితుడా !

నువ్వు, నేను – పాలు, మీగడ !     || ఓ ప్రియమైన ||

( స్నేహమయ జీవనులందరికీ ” మైత్రీ దినోత్సవ ” సందర్భంగా

హార్దిక శుభాభినందనలతో … )

— *** —

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. అరుణ పప్పు
  ఆగ 02, 2009 @ 23:22:58

  నమస్కారం ఫణీంద్రగారూ, స్నేహితుల పండగ సందర్భంగా శుభాకాంక్షలు, కాస్త ఆలస్యమైనందుకు మన్నించి మీ పుట్టినరోజు శుభాకాంక్షలను కూడ స్వీకరించండి. ప్రతిభ స్నేహాల మేలుకలయికగా మీరు సంతోషంగా వందేళ్లూ ఉండాలి.

  స్పందించండి

 2. అనానిమకుడు
  ఆగ 02, 2009 @ 23:27:30

  అన్నా! మృదు మధురం మీ స్నేహగీతం.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఆగ 02, 2009 @ 23:46:55

  అరుణ గారు !
  మీ అభిమానానికి కృతజ్ఞుడను !
  మీకు ప్రత్యేకంగా ” మైత్రీ దినోత్సవ ” శుభాభినందనలు !

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఆగ 02, 2009 @ 23:56:55

  అనానిమకుడు గారు !
  ” అన్నా ! ” అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. మీ అభిమానాన్ని ప్రకటించి నాకు ఆనందం కలిగిస్తున్నారు.
  మీ పరిచయ భాగ్యాన్ని మాత్రం నాకు కలిగించడం లేదు. మీరెవరో తెలియకపోయినా, ఒక అన్నయ్యగా పరిపూర్ణ హృదయంతో మీకు నిత్య సంతోష, సౌభాగ్యాలు కలగాలని ఆశీర్వదిస్తున్నాను.

  స్పందించండి

 5. venugopal
  ఆగ 10, 2009 @ 09:21:55

  Dear sir,
  The poem “o priyamina snehithuda” is very good.
  thankyou sir, I have remembered the my childwood days.
  looking forward for many more….

  Regrds
  venu

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఆగ 10, 2009 @ 09:48:26

  Venu garu !
  Thanks a lot !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: