వరాహ శతకము – 3

వరాహ శతకము (అధిక్షేప, హాస్య, వ్యంగ్య కృతి)

( మూడవ భాగము )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర


pig

దళసరి గాలి తిత్తి అది – దానిని ” దేహము “, ” కాయమం ” చెవో

విలువగు భిన్న నామముల వేమరు బిల్చుచు, దానిపై నరుల్

వలపును పెంచుకొందురయొ ! పాపము ! నిల్చునె, ఏదొ నాటికిన్

గలగల మ్రోగగా మరణ ఘంటిక లద్దియె ? ఓ వరాహమా !   …   22


తనువున నున్న అందమది తత్సమయంబున మెప్పు పొందినన్

దినములు సంతరింప నిక తేజము తగ్గి, నశించి పోవు ! ఆ

తనువె నశించిపోయినను ధన్యజనుం డలవర్చుకొన్న స

ద్గుణములు నిల్చిపోవు ప్రజ గుండియలందున ! ఓ వరాహమా !   …   23


అల ” కనకాక్ష ” రాక్షసుని అంతము జేయగ విష్ణుమూర్తి నీ

కులమున జన్మనెత్తెనట – కోరియు నీ కవతార కీర్తిడన్ !

కలియుగమందు ” భాగవత ” కావ్యమునందున ” పోతనార్యు ” డీ

పులకరమందజేయు కథ బోధన సల్పె నహో వరాహమా !   …   24


ధారుణి చాప జుట్టి మును దానవ వీరుడహంకృతిన్ బలా

త్కారము చేయబూన, హరి దాలిచి యంతట నీదు రూపు, సం

హార మొనర్చియున్ కువలయంబును గాచిన గాథ విన్నచో –

గౌరవ మింపు పెంపగును గాదటె నీ యెడ – ఓ వరాహమా !   …   25


మీనము రూపమెత్తినను మేనికి తృప్తియె కల్గ లేదొకో ?

తానటు కూర్మ రూపమును దాల్చిన సైతము తృప్తి గల్గదో ?

ఆనుక, నీదు రూపమది ఆదరమొప్పగ దాల్చ, నెట్టులా

శ్రీనిలయాఖ్యు దివ్య ఘన చిత్తము దోచితివో వరాహమా !   …   26


మీనము, కూర్మమున్, కిరియు, మీద నృసింహుని జంతు రూప; మా

పైన ధరించె గాదె హరి – వామన, భార్గవ, రామ, కృష్ణులై

మానవ రూప; మట్టుల సమస్త చరాచర లోకమందునన్,

ప్రాణు లవెల్లయన్న సమ భావన చాటగ – ఓ వరాహమా !   …   27


పాశుపతంబు గోరి అల ఫల్గుణు డుగ్ర తపంబు సేయగాన్,

శ్రీ శివశంకరుం డతని చేయ పరీక్షను నిన్ను నంప – నీ

వా శివ, పార్థు లిర్వురు ప్రహారకులై విడునట్టి బాణముల్

లేశము మాత్ర స్వార్థమును లేక సహించితివో వరాహమా !   …   28


తిరుమల కొండపైన ఘన తీర్థము నేర్పడ కారణమ్ము – నీ

తిరువభిధాన ధారియగు దివ్య మునీంద్రుని ఆశ్రమంబు శ్రీ

హరి చని తల్లితోడ, తన కాశ్రయ మిమ్మని కోరుటే గదా !

కరుణ వహించి ఆతడిడె గాదె స్థలంబట – ఓ వరాహమా !   …   29


నేటికి వేంకటేశ్వరుని నేరుగ దర్శన మొందబోరు మా

బోటుల భక్తులెవ్వరును – పొందరె ముందు వరాహమూర్తి స

ద్వాటిని దర్శనంబు – పిదపన్ తిరువేంకటనాథు సన్నిధిన్ !

చాటగ నీదు నామము ప్రశస్తిని శక్యమె ? ఓ వరాహమా !   …   30

( సశేషం )

ప్రకటనలు

1 వ్యాఖ్య (+add yours?)

 1. durgeswara
  ఆగ 01, 2009 @ 22:24:53

  మీలాంటి పెద్దలు రావటం ద్వారా
  హిందూధర్మము,సంస్కృతి పట్ల అంకితభావం తో ధర్మరక్షణకై సిద్దమైన ఒకవేదిక సుసంపన్నమవుతుంది.
  ఇక్కడ ఇచ్చిన లింక్ లోకెళ్ళి కాన్టాక్ట్ ఓనర్ అన్నచోట క్లిక్ చేసి లోకి వెల్లి మీవివరాలివ్వండి .ధర్మం పట్ల సంపూర్ణవిశ్వాసముంటే

  http://groups.google.co.in/group/punyabhoomi

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: