27 జూలై … ఈరోజు …

Image0621

27 జూలై … ఈరోజు నా పుట్టిన రోజు. ఈరోజుతో నాకు 48 ఏళ్ళు నిండాయి.
కవిగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకొంటే …
12 ఏళ్ళ వయసులో ( 8వ తరగతి చదువుతుండగా ) తొలి కంద పద్యాన్ని వ్రాసాను.
20 ఏళ్ళ వయసులో ” గోరా శాస్త్రి ” సంపాదకత్వంలో వెలువడిన ” ఆంధ్ర భూమి ” దిన పత్రికలో మొదటి సారిగా పెద్ద పత్రికలో నా కవిత అచ్చయింది.
తరువాత ఎన్నెన్నో కవితలు, వ్యాసాలు రచించాను. ఎన్నో ఎన్నెన్నో పత్రికలలో అచ్చయ్యాయి.
ఎన్నెన్నో కవి సమ్మేళనాలలో, సభలలో కవి, పండిత దిగ్గజాలతో కలసి పాల్గొన్నాను.
ఎన్నో పురస్కారాలను పొందాను. ఎన్నెన్నో సత్కారాలను పొందాను.
మాస్కో పర్యటించి, తెలుగులో విదేశ యానంపై తొలి సంపూర్ణ పద్య కావ్యాన్ని రచించాను.
వృత్తి పరంగా ఇంజినీరునైనా, తెలుగులో డాక్టరేట్ పట్టా పొందాను.
ఇవన్నీ ఎంత సంతృప్తినిచ్చినా ,
* నా ” మాస్కో స్మృతులు ” కావ్యానికి వ్రాసిన పీఠికలో … గుంటూరు శేషేంద్ర శర్మ గారు ” ఆచార్య ఫణీంద్ర సూర్యుడ్ని ఆకాశంలో గాలి పటంలా ఎగురవేసే కవి. ఈ కవి హృదయానికి ఏ రంగులూ లేవు, వాసనలూ లేవు. నిర్మల కాంతిమంతమైన హృదయము. ఆయన భాష సరళము _ భావములు మణి మాణిక్యాలు. ” అన్న వాక్యాలు ;
* నా చాటుకు మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్య , ” నా జీవిత చరమాంకంలో ఫణీంద్ర నన్ను కలవడం, నాకు తోడుగా నిలవడం వల్ల నా ఆయుర్దాయం మరో పదేళ్ళు పెరిగిం ” దని చెప్పుకోవడం ;
* మా గురువు గారికి వ్రాసిన లేఖలో డా. నాగభైరవ గారు ” ఫణీంద్ర కవితలు చూస్తున్నాను. ఈరోజు మంచి పద్య కవులను పది మందిని ఎన్నుకొంటే, అందులో ఫణీంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. భావిని ఏల గల సత్తా అతనిలో ఉంది. ” అన్న మాటలు ;
* ఉత్పల సత్యనారాయణాచార్య గారు నాతోనే స్వయంగా ” మా తరువాతి తరంలో ఎవరా ? అని చూస్తే, నాకు నువ్వొకడివి కనిపిస్తున్నావు” అన్న మాట _
ఇచ్చిన సంతృప్తి, ఆనందం వర్ణనాతీతం.
ఇప్పుడా మహానుభావులంతా లేరు. వారిచ్చిన ఆశీర్వాద బలం మాత్రం నా గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఆ స్ఫూర్తితో మరిన్ని ముందడుగులు వేసే ప్రయత్నం చేస్తాను.
మునుముందు కూడా సాహితీ మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పటిలాగే నా పైన ఆదరాభిమానాలను చూపుతారని ఆశిస్తున్నాను.
నా జీవితానికి అంత కన్నా ధన్యత ఏముంటుంది ?
అందరికీ నా అభివందనాలు !

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

12 వ్యాఖ్యలు (+add yours?)

 1. vinay chakravarthi
  జూలై 27, 2009 @ 12:46:27

  happy birthday ………….
  congratulations fo r ur achievements………….
  tc

  స్పందించండి

 2. జ్యోతి
  జూలై 27, 2009 @ 13:13:13

  పుట్టినరోజు శుభాకాంక్షలు ఫణీంద్రగారు, ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో , ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…

  స్పందించండి

 3. Nameless
  జూలై 27, 2009 @ 13:50:37

  శేషేంద్ర గారిని కలిసారా! అదృష్టవంతులు 🙂

  పుట్టినరోజు శుభాకాంక్షలండీ

  స్పందించండి

 4. padma
  జూలై 27, 2009 @ 15:35:52

  పుట్టిన రోజు శుభాకాంక్షలు

  స్పందించండి

 5. నరసింహా రావు మల్లిన
  జూలై 27, 2009 @ 17:20:42

  పుట్టిన రోజు శుభాకాంక్షలు

  స్పందించండి

 6. జీడిపప్పు
  జూలై 27, 2009 @ 17:50:19

  పుట్టినరోజు శుభాకాంక్షలు ఫణీంద్రగారు

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  జూలై 27, 2009 @ 23:31:26

  వినయ్ చక్రవర్తి గారు,
  జ్యోతి గారు,
  యోగి గారు,
  పద్మ గారు,
  నరసింహా రావు గారు,
  జీడి పప్పు గారు _
  బ్లాగులోకంలోని ఎందరో ఆత్మీయులు …
  అందరికీ అభివందనాలు !

  స్పందించండి

 8. భాస్కర రామి రెడ్డి
  జూలై 28, 2009 @ 01:49:47

  ఆచార్య ఫణీంద్రుల వారికి మనఃపూర్వక జన్మదిన సుభాకాంక్షలు.

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  జూలై 28, 2009 @ 06:41:16

  భాస్కర రామిరెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 10. Amma Odi
  జూలై 28, 2009 @ 11:26:07

  పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  స్పందించండి

 11. రాఘవ
  జూలై 28, 2009 @ 14:08:45

  జన్మదిన శుభాభివందనములండీ 🙂

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  జూలై 28, 2009 @ 17:23:21

  ” అమ్మ ఒడి ” గారికి,
  రాఘవ గారికి …
  కృతజ్ఞతాంజలి !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: