గాలి బ్రతుకులు

గాలి బ్రతుకులు

రచన : డా.ఆచార్య ఫణీంద్ర

apartments

జంట నగరముల ప్రజా జీవితా లిప్పు

డయొ ! ” అపార్టుమెంట్ల ” యందు వ్రేలె !

అందలమ్ములెక్కి ఆనందమే తొల్త _

కడకు తెలియు బోర్ల పడిన యట్లు !   …   1

నేల పైన కాదు _ నింగిలోనను కాదు _

ఆ ” త్రిశంకు స్వర్గ ” మనిన నిదియె !

క్రింద నుండు వాడు ” కేరు ” చేయడు నిన్ను _

పైన వాని కేది పట్టబోదు !   …   2

” లిఫ్టు ” పైకి నిన్ను ” షిఫ్టు ” చేయుచునుండు _

క్రొత్త యందు క్రొత్త క్రొత్త గుండు !

చెత్త కంపెనీదొ _ చెడు మాటిమాటికిన్ _

చిక్కి పోదువింక ఎక్కి మెట్లు !   …   3

” గ్రిల్లు ” మూయబోడు క్రింది కేగిన వాడు _

పైన ” లిఫ్టు ” నొక్క _ పైకి రాదు !

క్రింద కేగి చూడ _  గ్రిల్లు తెరచి యుండు _

ఒకని పైన నింద నొకడు వేయు !   …   4

ఒకతె ఇంటి ముందునున్న చెత్తను త్రోయు

ఎదుటనున్న వారి ఇంటి ముందు _

ఉన్న ” కారిడారు ” చిన్నదే ! అందొక్క

ముక్క తనది యగును _ ముగ్గులంతె !   …   5

పంపు నడుప నీళ్ళు పైవానికిన్ రావు

వాడుకొనును క్రిందివాడు నపుడె _

పంపు నాపినంత పైవాని గతి యంతె !

నిత్య యుద్ధమగును _ నీళ్ళ కొరకు !   …   6

” వాచుమన్ ” ను పిలువ _ వాడెక్కడో యుండు _

వలసినప్పు డెపుడు వాడు రాడు _

మందలించలేము మామూలుగా వాని _

వాడు పోవ, మరొక వాడు రాడు !   …   7

ప్రతిది గొడవ చేయు పంతాన నొక్కండు

” మేంటెనెన్సు ఫీజు ” మెలిక బెట్టి _

ఇచ్చు టాపివేయు నే చిన్న గొడవైన _

చచ్చి ఊరుకొంద్రు సభ్యు లపుడు !   …   8

చెప్పి పెట్టనేమి ” సెక్రెట్రి “, ” మీటింగు “

లోటుపాట్ల గూర్చి మాటలాడ _

కొందరే ” ప్రజెంటు ” _ ఎందరో ” ఆబ్సెంటు ” _

వచ్చు కొద్ది మంది చిచ్చు రేపు !   …   9

క్రొత్త బిచ్చగాడు కోశాధికారియే !

ఇంటి ఇంటి కేగి, ” మేంటెనెన్సు

ఫీజు ” నీయుమనగ _ విదిలింత్రు బాధగా !

మెక్క లేడు _ బాధ క్రక్క లేడు !   …   10

మిథ్య వోలె తోచు ” మీటింగు ” లవియన్ని _

గాలి మాటలన్ని _ తేల దేది !

వ్యథలు వ్యథలుగానె కథలుగా కొనసాగు !

గాలి బ్రదుకు లగును లీల తుదకు !   …   11

___ *** ___

ప్రకటనలు

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  జూలై 26, 2009 @ 22:29:16

  చాలా బాగున్నాయండి మీ గాలి బ్రతుకులు. స్వీయ అనుభవంతో వ్రాసారనుకుంటాను. పెద్దాపురంలో కూడా ఎపార్టుమెంటులొచ్చేసాయి ఈ మధ్యనే. అందులో చివరి ఐదవ అంతస్థులో రెండు ఫ్లాటులు మావి. ఎదురె దురుగా ఉన్నవి తీసుకోన్నాము. అవి రెండూ అద్దెకే ఇచ్చేస్తున్నాము. ప్రస్తుతం మేం ఉంటున్నది ఇండిపెండెంటు ఇల్లవటం చేతనూ ఓనర్లుకూడా దూరంగా వుండటం చేతనూ ఇక్కడనుండి స్వంత ఫ్లాటులోకి మారదామని పించట్లేదు.మేం పైదరాబాదులో ఉన్నపుడు ఫ్లాటులోనే ఉండేవాళ్ళం. అప్పటి అనుభవాలు (రెసిడెంటుగా) ఇప్పటి అనుభవాలు (ఓనర్ గా) తెలుసుండటం చేత మీరు వ్రాసినవి ప్రత్యక్షర సత్యాలుగా అంగీకరిస్తున్నాను. చాలా బాగా వ్రాసారు సార్. ధన్యవాదాలు.

  స్పందించండి

 2. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 26, 2009 @ 22:43:10

  మల్లిన వారికి మనఃపూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 3. భాస్కర రామిరెడ్డి
  జూలై 26, 2009 @ 22:50:43

  హి హి హీ… బలే వ్రాసరండీ..సూపర్.

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 26, 2009 @ 22:56:13

  ఆత్మీయ మిత్రులు భాస్కర రామిరెడ్డి గారికి
  అనేకానేక ధన్యవాదాలు !

  స్పందించండి

 5. padmarpita
  జూలై 27, 2009 @ 00:15:57

  చాలా బాగారాసారండి!

  స్పందించండి

 6. Usha
  జూలై 27, 2009 @ 01:17:03

  అన్నీ నిజాలే కానీ ఈ ఇరుకు బ్రతుకుల్లో ప్రక్క మనిషిని ఏదో ఒక రాగద్వేషంతో కలిపేవి ఈ నివాసాలేనేమో. మేము ఆస్ట్రేలీయా వెళ్ళీన క్రొత్తలోఇద్దరు వృద్దులు చనిపోయిన 6నెలలు నుండి సంవత్సర కాలం వరకు ఎవరూ గమనించేదు. వారివి విడి విడి ఇల్లు. కొట్టు కుంటూ తిట్టుకుంటూ కలిసి మెలిసి గడిపే జీవితాలేమో. ఇదీ పూర్తి నిజం కాదు ఆ మధ్య హిమాలయ శిఖరమ్మీద కలిసిన ఇద్దరు విదేశీయులు 7 సంవత్సరాలుగా ప్రక్క ప్రక్క అపార్ట్మెంటుల్లోనే వున్నమని తెలుసుకున్నారట.

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 27, 2009 @ 06:15:57

  పద్మార్పిత గారికి కృతజ్ఞతాభివందనాలు !

  స్పందించండి

 8. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 27, 2009 @ 06:21:24

  ఉష గారు !
  ” క్రింద నుండు వాడు ” కేరు ” చేయడు నిన్ను _
  పైన వాని కేది పట్టబోదు ! ” … అని నేను వ్రాసిం దదే కదా !
  ధన్యవాదాలు !

  స్పందించండి

 9. aswinisri
  జూలై 27, 2009 @ 10:32:00

  baagundi!

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  జూలై 27, 2009 @ 10:34:17

  అశ్వినిశ్రీ గారు !
  అభివాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: