మహాకవి దాశరథి

dasaradhi-Teluguwriterమహాకవి దాశరథి

—————————
రచన: డా. ఆచార్య ఫణీంద్ర

కవిత్వ బాంబులు కాల్చి, పేల్చి,
” అగ్ని ధార ” లకు ఆజ్యం పోసి,
నిజాము రాజును బజారుకీడ్చిన
ప్రజా కవీంద్రుడు దాశరథి !

స్వతంత్రమొందిన తెలంగాణమును
సమైక్యాంధ్రలో మిళితం చేసి,
” మహాంధ్రోదయం ” ఆకాంక్షించిన
విశాల హృదయుడు దాశరథి !

అంగారాన్ని, శృంగారాన్ని
బంగారంలా సింగారించి,
ఆంధ్ర కవితకే సొగసులు దిద్దిన
మహాకవీంద్రుడు దాశరథి !

సమతా వాదం, శాంతి నినాదం
జీవితమంతా నీకయె వేదం _
నీ ఆశయమే మా నవ కవులకు
ఆదర్శం, ఆచరణం _ దాశరథి !

[ 21 జులై నాడు కీ.శే. మహాకవి డా. దాశరథి 83 వ జయంతి సందర్భంగా నివాళిగా … ]

___ *** ___

ప్రకటనలు

11 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskara Rami Reddy
  జూలై 20, 2009 @ 21:46:48

  అంగారాన్ని, శృంగారాన్ని
  బంగారంలా సింగారించి,
  ఆంధ్ర కవితకే సొగసులు దిద్దిన
  మహాకవీంద్రుడు దాశరథి !

  బాగుంది ఆచార్యా.. తెలుగు కివిత్వానికి జిలుగులద్దిన దాశరధి గారికి నా తరపున కూడా నివాళి.

  స్పందించండి

 2. Nameless
  జూలై 20, 2009 @ 22:34:27

  అద్భుతం!! ఇంకా దాశరథి కొంతమందికైనా గుర్తునన్ందుకు సంతోషం గా ఉంది.

  “నీవే లోకమునిండ నిండితివి కానీ, ఈ ప్రభుత్వాలు ని
  న్నే వంచింపబలాలు కూర్చుకొనుచుండెన్, భగ్నజీవీ! తుపా
  కీ వర్షించెడు ఉక్కు గుండ్లు భవ దగ్ని స్ఫార నేత్రాలలో
  త్రోవల్ చేయుచు సాగలేక పరువెత్తున్ వెనక్కున్ వెనక్కున్”
  (మళ్ళించు రథము : అగ్నిధార)

  ఫణీంద్ర గారు – మీదగ్గర దాశరథి గారి పుస్తకాలు అన్నీ ఉన్నాయా?

  http://telugupadyam.blogspot.com/2008/07/blog-post_19.html

  http://pustakam.net/?p=1240

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూలై 20, 2009 @ 23:32:16

  భాస్కర రామిరెడ్డి గారు !
  అనేకానేక ధన్యవాదాలు !

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూలై 21, 2009 @ 00:07:03

  ” NAME LESS ” గారికి నమః
  దాశరథి నా అభిమాన కవి అనే కన్న, నా ఆరాధ్య కవి అనడం సబబు.
  ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవి డా.దాశరథి ( నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ) మా పెంకుటింటికి వచ్చారు.
  అప్పటికే నేను వ్రాసుకొన్న కొన్ని పద్యాలను, కవితలను, పాటలను తీరికగా చదివి, ” Well done young man ! Go ahead ! ” అని వెన్ను తట్టారు. తన గ్రంథాలన్నీ కలిపి ఒకే పెద్ద గ్రంథంగా ముద్రించిన ” దాశరథి కవిత ” ప్రతి నొకదానిని నాకు బహూకరించారు. అదంతా ఇప్పుడు తలచుకొంటే _ ” ఏ జన్మ పుణ్య ఫలమో ! ” అనిపిస్తుంది.
  ఈ మధ్య కాలంలో మూడు, నాలుగు మార్లు సాహిత్య రూపకాలలో ” దాశరథి ” పాత్ర ధరించి మెప్పించ గలగడం నా సౌభాగ్యమనే చెప్పుకోవాలి. అదొక మధురానుభూతి !
  ” నా గీతావళు లెంత దూరము ప్రయాణంబౌనొ _ అందాక ఈ
  భూగోళంబున నగ్గి వెట్టెదను … ” అన్నారు దాశరథి.
  ఈ భూగోళం ఉన్నంత వరకు ఆ అగ్గి మండుతూనే ఉంటుంది.
  ఆ ” అగ్ని ధార ” లకు చావు లేదు. వాటిని దర్శించ గలిగే దివ్య చక్షువులను మనం సాధించుకోవాలి. అంతే !

  స్పందించండి

 5. Nameless
  జూలై 21, 2009 @ 00:11:16

  ఆ గ్రంథం ఇంకా మీదగ్గరుందా? నాకు దాశరథి గారి పుస్తకాలన్నీ కావాలి. చాలా రజులనచీ ప్రయత్నిస్తున్నాను కానీ దొరకట్లేదు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో చెబుతారా? ఫోన్, ఇమెయిల్?

  స్పందించండి

 6. Nameless
  జూలై 21, 2009 @ 00:11:39

  ఆ గ్రంథం ఇంకా మీదగ్గరుందా? నాకు దాశరథి గారి పుస్తకాలన్నీ కావాలి. చాలా రోజులనుంచీ ప్రయత్నిస్తున్నాను కానీ దొరకట్లేదు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో చెబుతారా? ఇమెయిల్?

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 21, 2009 @ 00:24:14

  NAME LESS గారు !
  ఒకే ఒక ప్రతి ! అపురూపంగా దాచుకొన్నాను.
  నా ఫోన్ నంబర్లు, చిరునామా, మెయిల్ వివరాలు … అన్నీ ఈ బ్లాగులో కుడి ప్రక్కన ఉన్నాయి.
  ఒక ఆదివారం ముందుగా చెప్పి వస్తే … నా సమక్షంలో XEROX చేయించి అందజేయగలను,

  స్పందించండి

 8. Nameless
  జూలై 21, 2009 @ 00:40:44

  అద్భుతం!!!

  మీరు సహృదయతతో ఇవ్వబోతున్న ఈ కానుక నన్ను ఎంతగా సంతోషపెడుతుందో మాటల్లో చెప్పలేనండీ! ఆదివారం రోజు మిమ్మల్ని కలిసి జిరాక్స్ తీసుకుంటాను.

  I am indebted you!!

  I will send you an email.

  స్పందించండి

 9. Krishna
  జూలై 21, 2009 @ 02:58:12

  Name less garu,

  Daya chesi aa pustakanni scan cheyinchi share cheyagalaru…

  Krishna

  స్పందించండి

 10. నరసింహారావు మల్లిన
  జూలై 21, 2009 @ 05:55:50

  శ్రీ శ్రీ ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
  దాశరధి గారి సాహిత్యం పూర్తిగా చదవాలనుంది. మళ్ళీసారి మిమ్మల్ని కలిసినపుడు తప్పకుండా నాకో జిరాక్స్ కాపీని దయచేయించగలరు.
  మీ పుస్తకాలను సగం వరకూ చదివాను. మిగిలిన సగం పూర్తి చేసిన తర్వాత మీకు ఈ మెయిలు పంపిస్తాను.

  స్పందించండి

 11. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 21, 2009 @ 06:53:50

  నా మరొక బ్లాగు ” నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ” లో ” ఈ మాసం పద్య కవిత ” గా దాశరథి గారి పద్యాన్ని ఉంచాను. ఆసక్తి గలవారు చూడగలరు.
  http// dracharyaphaneendra.blogspot.com

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: