మతమేదైనా … కులమేదైనా … ( గీతం )

This is my 50th post

Water lilies

————————————————————————————————

man on globe

మతమేదైనా … కులమేదైనా … ( గీతం )
—————————————
రచన : డా. ఆచార్య ఫణీంద్ర

మతమేదైనా … కులమేదైనా …

మతమేదైనా _ కులమేదైనా _
మనలో మనకే భేదాలున్నా _
మనిషి పుట్టేదొకలాగే !
ఆపై గిట్టేదొకలాగే !                                     || మత ||

పెదవులు పలికే భాషదే కులం ?
హృదయంలో భావానిదే మతం ?
మనసులోని సంతోషమే కులం ?
కనులు కార్చు కన్నీటిదే మతం ?
ఆకలి మంటల పొగలదే కులం ?
ప్రేమ, వాంఛల సెగలదే మతం ?                     || మత ||

తల్లి కడుపులో చేరక మునుపు
తమ్ముడూ ! నీ మతమేది ?
వల్లకాటిలో కాలిన పిదప
చెల్లెలా ! నీ కులమేది ?
ముందూ, వెనుకా లేని తేడాలు
మూడు నాళ్ళ ఈ బ్రతుకు నెందుకో ?               || మత ||

ఒకే మట్టితో చేసాడు _
ఒకే రక్తమును పోసాడు _
ఒకే భూమిపై వదిలాడు _
ఒకటై బ్రతుకమన్నాడు _
చేసిన వాడికి లేవు భేదాలు !
మూసుక పోయెను మనిషి నేత్రాలు !!               || మత ||

___ *** ___

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

  1. Bhaskara Rami Reddy
    జూలై 16, 2009 @ 22:16:12

    పాట బాగుంది ఫణీంద్ర గారు.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    జూలై 16, 2009 @ 23:19:54

    భాస్కర రామిరెడ్డి గారు !
    హృదయ పూర్వక ధన్యవాదాలు !

    స్పందించండి

  3. ఆత్రేయ
    జూలై 16, 2009 @ 23:47:06

    ఆచార్యా పాట బాగుంది. అభినందనలు. ఎప్పటి నుండో ఒక సందేహం.. పాటలకు కూడా చందో నియమాలు ఉంటాయా .. ? కొంతమంది గాయకులతో ముఖాముఖీలో.. వారు పాట సాహిత్యంచూడగానె వారికి ఓ ట్యూను దానంతట అదే వస్తుంది అని చెపుతూ ఉంటారు. అదెలా సాధ్యమవుతుంది ? పాట ఒక బాణీలోకి ఇమడాలంటే అన్ని ఖండికలూ ఒకే లా ధ్వనించాలి కదా.. ? ఆ నేర్పు ఎలా వస్తుంది ? మాత్రా చందస్సులాంటివేమన్నా వాటికి మనం ఆపాదించాలా ? మీ సమాధానాలకు ముందుగానే ధన్యవాదాలు.

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    జూలై 17, 2009 @ 00:36:25

    ఆత్రేయ గారు !
    పాట గేయ సాహిత్యం కిందకు వస్తుంది. ఇది మాత్రా ఛందస్సుతో నడుస్తుంది.
    త్రిస్ర గతి అంటే మూడు మాత్రలతో నడుస్తుంది.
    ఉదా|| ఈ సినిమా పాటను చూడండి _
    కనులు | కనుల | తో
    3 | 3 | 2 కాని దీర్ఘంతో 3 గా భావించాలి
    కలబ | డితే | ఆ
    3 | 3 | 2 కాని 3
    తగవు | కు ఫల | మేమి?
    3 | 3 | 3

    చతురస్ర గతి నాలుగు మాత్రలతో నడుస్తుంది.
    ఉదా|| పైన ఉన్న నా గీతమే …
    మతమే | దైనా | కులమే | దైనా
    4 | 4 | 4 | 4
    మనలో |మనకే | భేదా | లున్నా
    4 | 4 | 4 | 4

    అలాగే ఖండ గతి ఐదు మాత్రలతో, మిశ్ర గతి 7 (3+4) మాత్రలతో సాగుతాయి.
    యతి ప్రాసలు మరీ ప్రతి చోటా కాకపోయినా సాధ్యమైన మేరలో కచ్చితంగా వేసే ప్రయత్నం చేస్తే అందం ఇనుమడిస్తుంది.
    అన్నమయ్య గీతాలను, లేకపోతే ఆధునిక కాలంలో నారాయణ రెడ్డి గారి గీతాలను అధ్యయనం చేస్తే ఈ నియమాలకు దగ్గరగా ఉండి, మంచి గీతాల రచన సాధనకు దోహదం చేస్తాయి.
    మీలాంటి భావుకులకు అందులో మంచి కవితాత్మక భావాలను నింపాలని వేరే చెప్పనక్కర లేదు కదా !
    ఇవి గీత రచన లక్షణాలు !

    స్పందించండి

  5. padmarpita
    జూలై 17, 2009 @ 01:43:33

    మతమేదైనా!!
    కులమేదైనా !!!
    మేమేమి అనగలం?
    బాగుంది మీ గేయం.

    స్పందించండి

  6. Dr.Acharya Phaneendra
    జూలై 17, 2009 @ 18:10:48

    పద్మ గారు !
    కృతజ్ఞతలు !

    స్పందించండి

  7. madhavaraopabbaraju
    జూలై 27, 2009 @ 10:50:08

    ఆచార్య ఫణీంద్రగారికి, నమస్కారములు.

    “మతమేదైనా…” :కవిత మనసుకు హత్తుకునే విధంగా వున్నది. అలాగే, ఏక వాక్య కవితలు కూడా బాగున్నాయి.

    భవదీయుడు,
    మాధవరావు.

    స్పందించండి

  8. Dr.Acharya Phaneendra
    జూలై 27, 2009 @ 10:59:50

    మాధవ రావు గారు !
    నమోవాకాలు

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: