ఇది రంగులు మారే లోకంరా !

sorrow

ఇది రంగులు మారే లోకంరా !
( భావ గీతం )
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
______________________________________________

ఇది రంగులు మారే
లోకంరా !
ఇట _ అందితే జుత్తును
పీకేరు !
అందకుంటే కాళ్ళకు
మ్రొక్కేరు !!
ఏ ఎండ కా గొడుగు
పట్టేరు !!!                       || ఇది రంగులు ||

ఆ దేవుడు మనిషిని
చేసాడు _
ఆ మనిషికి మనసును
పొదిగాడు _
ఈ మనిషి ఏమి
చేసాడు ?
తన మనసున స్వార్థం
నింపాడు !                      || ఇది రంగులు ||

నీతో పని ఉంటే నీవు
దైవానివి !
నీతో పని లేకుంటే
దయ్యానివి !!
ఈ లోకం తీరు
ఇంతేరా !
నివ్వెర పోవుట నీ
వంతేరా !!                       || ఇది రంగులు ||

నీ ముందర _ మూతులు
నాకేరు !
నీ వెనుక _ గోతులు
తోడేరు !
ఈ మనిషిని నమ్ముట _
ఇక చాలు !
ఒక మ్రానును నమ్మిన _
అది మేలు !!                   || ఇది రంగులు ||

___ *** ___

ప్రకటనలు

17 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  జూలై 06, 2009 @ 23:43:15

  mee kavitaku praNamillutunnavi naa karamulu.

  స్పందించండి

 2. padmarpita
  జూలై 06, 2009 @ 23:44:02

  మీ కవితకు ప్రణమిల్లుతున్నవి నా కరములు.

  స్పందించండి

 3. ఆత్రేయ కొండూరు
  జూలై 07, 2009 @ 00:21:05

  ఆచార్యా వందనాలు..
  గేయం బాగుందండీ..
  కవితా వస్తువుకి వస్తే !! ఈ కాలంలో రంగులు మార్చని/మార్చలేని వారిని నలుసులా తొక్కి వెళ్ళి పోతుంది లోకం. ఈనాటి రాజకీయాలు చూడండి.. అందరూ రంగులు మార్చే వారే.. వారికే పట్టాలు కట్టబెడుతున్నారు ఈ జనాలు… వీళ్ళ ఆలోచనా సరళులే మారాలి. ఒకో సారి నాకు, స్వతంత్రం రాక ముందే భారతం బాగుండేదేమో అనిపిస్తుంది.. ఒకే లక్ష్యంగా… వారి బాటలు వేరైనా.. వారందరి లక్ష్యం ఒక్కటే… ఇప్పుడూ… అంతే కానీ లక్ష్యమల్లా.. స్వార్ధం..

  పందండి ముందుకు, పదండి త్రోసుకు పదండి పోదాం పైపైకి.. అన్న పదాలకు అర్ధాలు ఇప్పుడు మారిపోతున్నాయి.

  తొయ్యండి వీడిని తొక్కండి వాడిని, దోచండి చేతికి చిక్కిందంతా.. అయిపోయింది పరిస్థితి.

  ఇవే భావాలను నా బ్లాగులో కవితా రూపంలో చూసి మీ అభి ప్రాయం చెప్పండి.
  http://aatreya-kavitalu.blogspot.com/search/label/దేశం

  స్పందించండి

 4. శివ బండారు
  జూలై 07, 2009 @ 01:30:10

  నిజాలు చెప్పారు. బాగుంది

  స్పందించండి

 5. narasimharaomallina
  జూలై 07, 2009 @ 03:51:50

  పాప ఫొటోకి కవితకు సంబంధం అర్థం కాలేదు.
  మీ స్వంత గళంలో పాట వినిపిస్తే బాగుండేది.
  పాట చాలా బాగుంది. అభినందనలు.

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 07, 2009 @ 03:53:39

  పద్మ గారు !
  మీ అభిమానానికి నా హృదయం పులకించింది.
  మీకు నా నమోవాకాలు !

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 07, 2009 @ 03:56:43

  ఆత్రేయ గారు !
  మీ కవితను చదివాను. చాలా బాగుంది. వ్యాఖ్యను కూడా ఉంచాను.
  ధన్యవాదాలు !

  స్పందించండి

 8. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 07, 2009 @ 04:02:15

  శివ బండారు గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

 9. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 07, 2009 @ 04:15:43

  నరసింహారావు గారు ! నమః !
  కల్మషం ఎరుగని హృదయం ఈ లోకం నిండా నిండిన స్వార్థం చూచి నివ్వెరపోక తప్పదు.
  కల్మషం లేని హృదయానికి ప్రతీక పాప … పాప ముఖంలో ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తుందని భావిస్తున్నాను.
  గీతాన్ని నా స్వంత గళంతోనే వినిపించానే ! ఎవరి గళానికి అనుకరణగా మీకు తోచిందో నాకు అర్థం కాలేదు. బహుశః ” యే రంగ్ బదల్తీ దునియా మే ” అన్న హిందీ పాట ట్యూన్ ఆలంబనగా ఈ గీతాన్ని వ్రాయడం వలన మీ కలా అనిపించి ఉంటుంది.
  పాట నచ్చినందుకు ధన్యవాదాలు !

  స్పందించండి

 10. చిలమకూరు విజయమోహన్
  జూలై 07, 2009 @ 04:52:06

  ఆచార్యులవారికి నమస్కారం,
  కవిత చాలా బాగుందండి.చదువు ఎక్కువైన తర్వాతే స్వార్థం ఎక్కువవుతోంది.

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  జూలై 07, 2009 @ 05:17:30

  విజయ మోహన్ గారు !
  మీరన్నది నిజమే ! ధన్యవాదాలు !

  స్పందించండి

 12. narasimharaomallina
  జూలై 07, 2009 @ 05:18:09

  పాటను చదివాను కాని వినలేదు. ఎలా వినాలో తెలియలేదండి. కొంచె చెప్తారా దయచేసి.

  స్పందించండి

 13. కోడీహళ్లి మురళీమోహన్
  జూలై 07, 2009 @ 05:52:18

  మీ గేయం అద్భుతంగా ఉంది. అన్నట్లు మూసీ పత్రికలో మీ వ్యాసం ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు చదివాను. బాగుంది. మన బ్లాగు మిత్రులకోసం ఆ వ్యాసాన్ని మీ బ్లాగులో పెట్టండి. అలాగే మీ అధిక్షేప కావ్యం వరాహ శతకం ఈ బ్లాగులో ధారావాహికగా చదవాలనుకుంటున్నాము.

  స్పందించండి

 14. Dr.Acharya Phaneendra
  జూలై 07, 2009 @ 05:56:07

  నరసింహారావు గారు !
  క్షమించండి ! ” మీ స్వంత గళంలో వినిపిస్తే బాగుండేది ” అంటే, కవిత ఏదైనా వేరే కవితకు ” అనుకరణ ” అంటున్నారేమో అనుకొని పొరబడ్డాను. కానీ, మీరంటున్నది ” ఆడియో ఉంచమని ” అని తరువాత గ్రహించాను. సారీ ! నాకంత పరిజ్ఞానం లేదు. మొన్న శ్రీశ్రీ ” మహా ప్రస్థానం ” పై నేను చేసిన కావ్యగానం వీడియోను బ్లాగులో ఉంచాలని ప్రయత్నించి విఫలమయ్యాను.
  ఇక ఈ పాట సంగతి _ ఇది ” యే రంగ్ బదల్తీ దునియా మే ” అన్న పాత హిందీ పాట ట్యూన్ లో వ్రాసాను. అయితే ” రంగ్ బదల్తీ దునియా ” అన్న పదాలను మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని ” రంగులు మారే లోకం ” అని వ్రాసాను కానీ, మిగితా సాహిత్యమంతా వేరే ! హిందీ పాట తెలిస్తే, ఆ ట్యూన్ లో మాత్రం పాడుకోవచ్చు.

  స్పందించండి

 15. Dr.Acharya Phaneendra
  జూలై 07, 2009 @ 06:12:32

  కోడిహళ్ళి మురళీ మోహన్ గారు !
  మీ అభిమానానికి నా హృదయం ఉప్పొంగింది.
  వీలును బట్టి మీ సూచనలను పాటిస్తాను.
  మీకు నా అనేకానేక ధన్యవాదాలు !

  స్పందించండి

 16. ఉష
  జూలై 07, 2009 @ 07:43:58

  “తొలి కోడి కూసింది” సినిమాలో ఒక పాటుంది “అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా…” అని సాగుతుంది. అది గుర్తుకొచ్చింది. వ్యాఖ్య వ్రాస్తూ వెదికితే పూర్తి పాట ఇక్కడ దొరికింది http://achampetraj.blogspot.com/2009/02/blog-post_09.html ఎన్ని వేదనలు, ఆక్రోశాలు వెలికివచ్చినా ఈ లోకం తీరు మారేదా, మారే తన రంగులు ఆగేనా?

  స్పందించండి

 17. Dr.Acharya Phaneendra
  జూలై 07, 2009 @ 20:04:51

  ఉష గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: