సూర్య ప్రశస్తి

sun

సూర్య ప్రశస్తి
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా || ఆచార్య ఫణీంద్ర

గ్రహ మండల మధ్యంబున
దహియించుచు నిన్ను నీవు త్యాగ నిరతితో
మహికి వెలుంగుల నిత్తువు _
ఇహ పరముల నీకు సాటి ఎవరాదిత్యా ?

నీ తేజస్సును, నీ మహస్సు, సతమున్ నీ లోక సంచారమున్,
నీ తీవ్ర భ్రమణంబు చిమ్మ దిశలన్ నీ కాంతి పుంజమ్ములన్,
చేతోమోదముతో సదా పరులకై చేపట్టు నీ త్యాగమున్,
ఏ తీరీ ధరణిన్ కవీంద్రులకు వర్ణింపంగ శక్యంబగున్ ?

నీ రాకతో గల్గు పవలు, కలిగించు నీ పోక రేయి _
ఊరువుల్ లేకయే నీవు విశ్వమం దూరేగ దినము,
వారమ్ము, పక్షమ్ము, మాసములు గల్గు _ వత్సరంబులగు _
ధారుణీ ప్రజలకున్ నీదు ధృతితో శతాబ్దులే కల్గు _
( ఛందస్సు : మధ్యాక్కర )

” నీవె యున్న వెలుగు _ నీ లేమి చీకటౌ ”
అనుచు పొగడ నెవరినైన కవులు;
అదియె అక్షరాల అతిశయోక్తియె గాని,
నీ యెడ అది సతము నిజము సుమ్ము !

సూర్య నమస్కారమ్ముల
ఆర్యు లుదయ మాచరించి _ ఆరోగ్య, మనో
ధైర్యమ్ముల బడసిరి _ ఘన
కార్యమ్ముల సలుప గల్గ, కడు దక్షులుగన్ !

ఆధునిక కాలమందు నిత్యావసరము
విద్యుదుత్పత్తి తగినంత విస్తరిలక _
సౌర శక్తియె మరల మా సాధనమయె !
మిత్ర ! నిజముగా మా జగన్మిత్రు డీవు !

కృష్ణ భగవాను, బుద్ధుని, క్రీస్తు దేవు
నేరుగా చూచినట్టి వారేరి నేడు ?
నరుల కానాటి నుండి ఈనాటి వరకు
తరతరాలుగా ప్రత్యక్ష దైవ మీవు !

___ *** ___

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. సురేష
  జూలై 01, 2009 @ 20:25:55

  చాలా బాగుంది

  స్పందించండి

 2. durgeswara
  జూలై 01, 2009 @ 22:16:50

  chaalaa baagaavraasaaru aadityuni mahioma

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 01, 2009 @ 22:37:05

  సురేశ గారికి, దుర్గేశ్వర గారికి _
  ధన్యవాదాలు !

  స్పందించండి

 4. narasimharaomallina
  జూలై 01, 2009 @ 22:46:31

  మధ్యాక్కఱ చూడగానే విశ్వనాధ వారు గుర్తుకొచ్చారు. చాలా అందంగా వ్రాసారండి భావయుక్తంగానూ, ధారాశుద్ధితోనూ ఉన్నాయి మీ పద్యాలు. మీ దగ్గఱ పద్యాలు వ్రాయటం నేర్చుకోవాలనుంది సార్.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూలై 01, 2009 @ 23:26:22

  నరసింహారావు గారు !
  ధన్యవాదాలు !
  నా మరొక బ్లాగు ” నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ” లో పద్య రచనకు సంబంధించిన పాఠాలు వ్రాస్తున్నాను. చూడండి.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: