విశ్వంభర

” విశ్వంభర “
రచన : “పద్య కళా ప్రవీణ” డా || ఆచార్య ఫణీంద్ర

ఎవ్వరటంచు నెంచితివి ? ఏను మహీతల మోయి మానవా !
ఎవ్వరెరుంగ రాయె మునుపెన్నడు పుట్టితి నేను సృష్టిలో _
త్రవ్విన కొల్ది నా చరిత దర్శనమిచ్చును వింత వింతలై _
నివ్వెర పోక విన్ము నే వివరింతును నా చరిత్రమున్ !

పూర్వ కాలమందు వేర్వడి చల్లారె
గ్రహములు రవి నుండి ఖండములుగ _
శాస్త్రకారులంద్రు _ సౌర మండలమందు
పుట్టితటులె నేను ” భూమి ” పేర !

కలవు పేర్లు పెక్కు _ క్ష్మా, క్షితి, మేదిని,
పుడమి, క్షోణి, పృథ్వి, భువి, ధరిత్రి,
వసుమతి, ఇల, అవని, వసుధ, విశ్వంభర,
ధారుణి, ధర, ధరణి, ధాత్రి, ఉర్వి _

పుణ్యులైన, పాప పురుషులైనను గాని
ఏక దృష్టి గలిగి, ఎపుడు మిమ్ము
మోయుచుందు నేను ధ్యేయమై సహనమ్ము _
తరతరాల ప్రజకు తల్లి నేను !

చెట్టు మోయుచుందు _ పుట్ట మోయుచునుందు
చెరువు, నదియు, కడలి, బరువు కొండ;
మనుజులార ! మీరు మనుట కావశ్యకం
బిల్లు, పొలము, పురము లెల్ల మోతు !

విత్తు నిడిన దాని వృక్షంబుగా మార్చి,
ఫలము, పుష్పములను, పత్రములను
మీకు నందజేసి, మీ మంచి చెడు జూచు
తల్లినైన నాకు దక్కె నేమి ?

హరిత వనమ్ముల వస్త్రము
ధరియించుచు మురియుచుండు ధాత్రిని నన్నున్
పురములు కట్టుట కొరకై
కరుణారహితులు వివస్త్ర గావింతురయో !

త్రాగు నీరు కొరకు త్రవ్వేరు నా మేను _
తూట్లు పొడిచి పొడిచి తోడుచుంద్రు !
త్రాగుడేమొ ! మీదు దాహార్తి పాడ్గాను _
ఒంటిలో మిగుల్చ రొక్క చుక్క !

నీరు మొత్త మింకి, నిస్సత్తువై యుండ _
కనికరమ్ము లేక కఠినులగుచు
గుండెలోన దింపి గొట్టాలు లోతుగా
” పంపు ” తోడ తోడి చంపుచుంద్రు !

ఒళ్ళు డొల్ల యయ్యి, కళ్ళు చీకటి క్రమ్మి
తూట్లు పడిన నేను తూలుచుండ _
” కఠినురాలు భూమి కంపించె ” నని మీద
దుమ్ము వోయుచుంద్రు, తూలనాడి !

ఇన్ని చేయనేమి ? ఇన్ని నాళ్ళుగ మిమ్ము
మోయుచుంటి _ భావి మోయగలను !
ఎదను తన్ను పాప నెత్తి ముద్దిడునట్టి
కన్న తల్లి వోలె కరుణ గలిగి !

___***___moter earth

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. మందాకిని
  జూన్ 25, 2009 @ 09:52:56

  నమస్కారములు.
  భూమాత వెతలు సరళంగా వర్ణించారు. బాగుంది.

  స్పందించండి

 2. rayraj
  జూన్ 25, 2009 @ 17:03:51

  భలే!నాకూ అర్ధమైపోతోంది! బావుందండి.

  స్పందించండి

 3. sailendra to phaneendra
  జూన్ 25, 2009 @ 21:00:45

  respected sir,

  foremost i would like to say thanks for sending a delightful and encouraging letter on my book anantha thandavam and further i would like to say sorry for responding so late to you as i was totally assigned the duties of a seminars,surveys and symposiums which have taken the lions share of my time daily and prevented me to follow my personal interests. Further i just read your viswambhara verse which is throwing light on the plight of mother earth in the hands its ruthless sons i.e., human population. You just created marvolous painting of agony of mother earth through your verse which is depicting the viswambhara of sri C.N.R. in its entirity in few lines. i remember your advice for making attempts to write poetry in chandassu on which i have work a lot as it is a herculian task for a person like me. i need your valuable guidance in this connection. further to add, recently unexpectedly i met a one more great personality like you. He is none other than Sri vemu bheema shankaram garu who is a reknown poet as well as a scientist in geophysics. when i met him he was referring to you and your works which praised by him like any thing. i wish in near future we will meet again. Thank u with a wish for your blessings

  yours

  seshasailendra

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూన్ 25, 2009 @ 23:35:34

  మందాకిని గారికి, రేరాజు గారికి ధన్యవాదాలు.
  ఆంధ్ర సాహిత్యంలో సరళ సుందర పద్య రచన అందించిన్ బమ్మెర పోతన, కరుణశ్రీ, వేమన నాకు స్ఫూర్తి. మా గురువు గారు నండూరి రామకృష్ణమాచార్య నన్ను అలాంటి రచనే చేయమని ప్రోత్సహించారు. మరొక మాట చెప్పనా ? మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ నా
  ” మాస్కో స్మృతులు ” కావ్యానికి పీఠికను వ్రాస్తూ ఇలా ఆశీర్వదించారు _ ” ఆయన కవిత్వం అతి సాధారణ శబ్దాల్ని మణి మాణిక్యాల వంటి భావాలుగా అల్లిన అద్వితీయ కళ. భాష వ్యావహారిక మనిపిస్తుంది.
  కానీ స్వచ్ఛమైన తెలుగు. నిష్కర్షగా వ్యాకరణ బద్ధమైన తెలుగు. సమాస భూయిష్టంగా, సంస్కృత శబ్ద బహుళంగా వ్రాయడం సులువు. కానీ వీరి రచన కత్తి మీద సాము. అతి సాధారణ భాషను కావ్య భాషగా శిల్పించడం విశిష్ట నైపుణ్యం. ”
  ఏమో ! అదే నా బలం, బలహీనత కావచ్చు !

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 25, 2009 @ 23:57:24

  శైలేంద్ర గారు !
  కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
  భీమ శంకరం గారు, నేను సతీర్థ్యులం ( ఒకే గురువు _ కీ. శే. నండూరి వారికి శిష్యులం. ) కానీ ఆయన మహాకవి. ఆయన కవన శైలికి, నా కవిత్వానికి మధ్య సూర్య కాంతికి, దీప కాంతికి ఉన్నంత తేడా ఉంది.
  ఎంత ఎడ తెరపి లేకుండా ఉన్నా కవిత్వాన్ని అలక్ష్యం చేయకండి. వీలు చూసుకొని కలవండి. ఛందోబద్ధ కవిత్వ రచన నేర్పగలను. కవిగా మీకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  స్పందించండి

 6. madhavaraopabbaraju
  జూలై 07, 2009 @ 17:52:49

  ఆచార్య శ్రీ ఫణీంద్ర గారికి, నమస్కారములు.

  మీ బ్లాగ్ ఇదే మొదటసారిగా చూస్తున్నాను. కొన్ని కవితలు చదివాను. “విశ్వంభరి” కవిత చక్కగ వున్నది. “హరిత వనమ్ముల వస్త్రము ధరియించు…” అని వ్రాసి, ప్రకృతిని మానవుడు ఎంత కౄరంగా హింసిస్తున్నాడో వివరించారు; కనువిప్పుగావించారు.

  మీకు సమయం ఉంటే నా తెలుగు బ్లాగును చూసి, మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయగలరని మనవి. “బ్లాగు లింక్” క్రింద ఇస్తున్నాను.

  భవదీయుడు,
  మాధవరావు.

  http://madhavaraopabbaraju.wordpress.com/

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  జూలై 08, 2009 @ 05:23:21

  మాధవ రావు గారు ! కృతజ్ఞతలు !
  మీ బ్లాగును చూసాను. కవితలు బాగున్నాయి. అభినందనలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: