గుమాస్తా జీవితం

newimage1
గుమాస్తా జీవితం
రచన : డా || ఆచార్య ఫణీంద్ర

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం
అందివచ్చే మొత్తం జీతం
అప్పులకు, కటింగులకే పరిమితం
స్వంత ఇల్లు ఒక “సప్నా”
అద్దె కొంపే మరి “అప్నా”

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

లాస్టు వరకు ఒత్తగా ఒత్తగా
ట్యూబు నుండి రానని మొరాయిస్తున్న
“టూతు పేస్టు”లా _
ఫాస్టుగా పెరిగిపోతున్న పాల ప్యాకెట్ ధరలకు
టేస్టు పడిపోతున్న తేనీటి చుక్కలా _
కరగిపోయి , మిగిలిన కాసింత కూడ
ఒంటిపై అరగదీసే ప్రయత్నంలో
నురగ రాని సబ్బు పిక్కలా _
పీకల దాకా ఆకలి నిండగా
కేకలేస్తున్న “లోప్రొఫైల్” డొక్కలా _

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

“ఫాయిదా” లేకున్నా
వాయిదాల మీద నాల్గు వస్తువులను
కొనుక్కొనే లోపే
చేయి పట్టుకొని తిరిగే చిట్టి తల్లి
గుండెల మీద కుంపటై కూర్చుంటుంది _
“నాన్నా! నాన్నా!” అంటూ కాళ్ళ సందుల్లో
తిరిగే నానిగాడు
గొంతుపై గుదిబండై వేళ్ళాడుతుంటాడు _

వేసేది వేలెడంత తీసేది కాలెడంతగా ఉన్న
“ప్రావిడెంటు ఫండు” ఖాతా
పూర్తిగా “ఖతం” అయితే గానీ
గుండెల మీద కుంపటి ఆరదు.
గొంతుపై నుండి గుదిబండ దిగదు.

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

“రిటైర్మెంట”య్యాక బ్రతుకు “క్యాసెట్టు”ను
“రివైండు” చేసి చూస్తే _
తోడుగా నడిచొస్తున్న జీవిత భాగస్వామికి
తొలి రోజుల్లో నాలుగయిదు
తెలుగు సినిమాలు మాత్రం చూపినట్టు గుర్తు!

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం
“పెన్షను” మొత్తం
పిడికెడు మెతుకులకే అంకితం
స్వంత ఇల్లు ఒక “సప్నా”
అద్దె కొంపే మరి “అప్నా”

(ఈ కవిత రచనా కాలం 1989. ఇరవయ్యేళ్ళయినా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదూ! )
___***___

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. narasimharaomallina
  జూన్ 22, 2009 @ 13:11:34

  గత ఇరవై యేళ్ళల్లో పరిస్ధితులు ఇంకా దారుణంగా తయారయ్యాయా లేక మెరుగయ్యాయా.

  స్పందించండి

 2. sree
  జూన్ 22, 2009 @ 15:22:11

  “20 ఏళ్లు గడిచినా పరిస్థితులు అలానే ఉన్నాయి” అంటే నేను ససేమిరా ఒప్పుకోను. 🙂
  పెరిగిన నిత్యావసర ధరలతో సగటు జీవి మరింత సతమతమవుతున్నాడు, బాధ్యతల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నాడు..
  “పరిస్థితులు మరింత జటిలమయ్యాయి” అనండి.. ఒప్పుకుంటాను 🙂

  స్పందించండి

 3. rayraj
  జూన్ 22, 2009 @ 17:44:10

  “రిటైర్మెంట”య్యాక బ్రతుకు “క్యాసెట్టు”ను
  “రివైండు” చేసి చూస్తే _
  తోడుగా నడిచొస్తున్న జీవిత భాగస్వామికి
  తొలి రోజుల్లో నాలుగయిదు
  తెలుగు సినిమాలు మాత్రం చూపినట్టు గుర్తు!

  భలే కరెక్టుగా చెప్పారు.
  ఈ మధ్యే రాశారేమో అనుకున్నా…ఇవవై ఏళ్ళ నుంచీ ఇలాగే ఉంది. నిజమే!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూన్ 22, 2009 @ 18:56:03

  రేరాజు గారికి నమః
  కవితలో నాకు ప్రీతిపాత్రమైన భాగాన్ని స్పృశించారు.
  ఆనాడైనా, ఈనాడైనా ప్రతి మధ్యతరగతి కుటుంబికుని తొలిచే ప్రశ్న _ ” కుటుంబ భారాన్ని తనతోబాటుగా మోస్తూ వస్తున్న అర్ధాంగికి ఏం చేస్తున్నామా ? ” అని.
  ధన్యవాదాలు !

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 22, 2009 @ 19:19:04

  నరసింహారావు గారు ! శ్రీ గారు !
  పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి అనలేము. ఎందుకంటే 20 ఏళ్ళలో జీతాలు చాలా రెట్లే పెరిగాయి.
  అలాగని పరిస్థితులు మెరుగయ్యాయని కూడా అనలేము. ధరలు కూడా అలాగే పెరిగాయి మరి. కాలానుగుణంగా మధ్య తరగతి ప్రజల ఆశలు , అవసరాలు కూడా చాలానే పెరిగాయి. అది కొంత వరకు స్వయంకృతాపరాధం కూడా. మరీ నిరాశావాదం పనికిరాదు. అందు వలన పరిస్థితులు అలానే ఉన్నాయి అనుకోవడమే సబబు అని నేను భావిస్తున్నాను.
  కేవలం చివరి వ్యాఖ్య గురించి కాకుండా కవితపై కూడా స్పందించి ఉంటే కవిగా మరింత సంతోషించి ఉండేవాణ్ణి . మీ ఇరువురికి నా ధన్యవాదాలు.

  స్పందించండి

 6. madhavaraopabbaraju
  జూలై 07, 2009 @ 18:18:23

  ఫణీంద్ర గారికి, నమస్కారములు.

  “గుమాస్తా జీవితం” కవిత నిజ జీవితానికి అద్దం పట్టినట్లుంది. ఎందరో రాజులు ( ముఖ్య మంత్రులు ) వస్తున్నారు; గుమాస్తాల నుదుళ్ళపై తమదైన రీతిలో ” ఎదుగుదలలేని వ్రాతలు” వ్రాసి, తమ నుదుళ్ళపై మాత్రం, తమకు తామే “భాగ్య రేఖలను” రాసుకొని పోతూవున్నారు. ఆఖరికి “ఉగాది పంచాంగ శ్రవ్రణం” కూడా తమకు, తమ ప్రభుత్వాలకు అనుకూలంగా చెప్పించుకుంటున్న రోజులివి. మంచిరోజులు రావాలని ఆశిస్తూ, శెలవ్.

  భవదీయుడు,
  మాధవరావు.

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  జూలై 08, 2009 @ 05:25:22

  మాధవ రావు గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: