డా.ఆచార్య ఫణీంద్ర విరచిత వచన కవితలు – 4

pebbles
గులక రాళ్ళు
————–
నిండు యవ్వనంలో గడచిన నాళ్ళు
గుండె వాగులో గులక రాళ్ళు –

కాల ప్రవాహం కదలి పోయినా
జ్ఞాపకాల అలల అడుగున నిలిచి ఉంటాయి!

కాలం
——-
కాలం ఒక
కాలుతున్న సిగరెట్టు
గట్టిగా దమ్ము లాగి
ఊపిరి తిత్తుల నిండా
ఉత్తేజం నింపుకో!
ఉద్దేశ్యాలను సాధించుకో!

చేతిలో నున్న దానిని
సద్వినియోగం చేసుకోకపోతే
మిగిలేది నుసి!
వ్యర్థమైన కాలానికి
గురుతుగా మసి!!

సమైక్యత
———–
నా సంతానంలో చెలరేగే
స్పర్థలకు, సమరాలకూ
మూల కారణమయ్యే
సంపాదనను నేను
సమకూర్చదలచుకోలేదు –

ఎందుకో తెలుసా?
కనీసం నా శ్రాద్ధం నాడైనా
“మా బాబుగాడు
ఏం సంపాదించాడు?
ఏం మిగిల్చాడు? – అంటూ
కలసి కట్టుగా
దుమ్మెత్తి పోస్తారని!

—***—

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. nutakki raghavendra rao
    ఏప్రి 14, 2009 @ 01:08:29

    ఆచార్యా!
    న్ ఫ్ సి పునాదులలో అట్టడుగున
    పడివున్నయట్టి ఓ పురాతన
    శిలా ఛిద్రాన్ని నేను
    కానీ
    మీ ఙ్నాపకాల పుటలు తిరగేస్తూ
    పోతే కనబడక పోను
    ఓ నానూ లా సూక్ష్మంగా ధరా తలాన
    లేదా ఓ ఎరొ ప్లేన్ లా ఎక్కడో ఆకశాన

    మీ కవిత ‘సమైక్యత ‘
    కవితా రీతియె కాక
    సామాజిక చింతన,
    ప్రస్తుత సామాజిక
    జీవన చిత్రణ ,
    విశ్రుంఖల మానవ
    బంధనా సంబంధితిత వేదన ….
    చిన్ని కవితలొ హ్రుద్యంగా
    వున్నతంగా ఆహో
    అందుకోండి నా అభినందన.
    Nutakki Raaghavendra Rao,
    http://www.nutakki.wordpress.com

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    ఏప్రి 14, 2009 @ 23:12:09

    రాఘవేంద్ర రావు గారు!
    గుర్తుకొచ్చారు. బాగున్నారా?
    కవిత నచ్చి అభినందన తెలిపినందుకు
    ధన్యవాదాలు.
    – డా.ఆచార్య ఫణీంద్ర

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: