“ఏక పద్య రామాయణం”

shree-ram“ఏక పద్య రామాయణం”
——————————

ఈ మధ్య అంతర్జాలంలో కొన్ని బ్లాగులలో “ఏక శ్లోకి రామాయణం” గురించి వ్రాసారు. అది చదివిన నేను “ఏక పద్య రామాయణం” ఎందుకు వ్రాయగూడదు? – అనుకొన్నాను. ఆ ప్రయత్న ఫలితమే – ఈ క్రింది పద్యం. “శ్రీ రామ నవమి” పర్వదిన సందర్భంగా అందిస్తున్న ఈ నా పద్యాన్ని చదివిన వారికి, పారాయణం చేసిన వారికి, విన్న వారికి – లోకాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడు
అన్ని ఆపదలను తొలగించి, సకలైశ్వర్య సంప్రాప్తిగా దీవించు గాక!

– డా.ఆచార్య ఫణీంద్ర

“యాగ ఫలంబుగా జననమంది, మహాస్త్ర కళా విదుండునై,
యాగము గావగా జని, శివాంకిత చాపము ద్రుంచి, జానకిన్
తా గొని పత్నిగా, పిదప – తండ్రి వచః పరిపాలనన్ వనం
బేగి, దశాననున్ దునిమి, ఏలికయౌ రఘురాము మ్రొక్కెదన్!”

ప్రకటనలు

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఆత్రేయ
  ఏప్రి 04, 2009 @ 01:38:47

  ఆచార్యా చాలా బాగుంది.
  మీకు మీ కుటుంబానికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  స్పందించండి

 2. mallina rao
  ఏప్రి 04, 2009 @ 05:50:56

  బాగుందండి. సుగ్రీవుణ్ణి హనుమంతుడినీ కూడా కలపగలిగితే ఇంకా బాగుండేది. ప్రయత్నించండి.మీకు తప్పక సాధ్యం అవుతుంది.

  స్పందించండి

 3. mallina rao
  ఏప్రి 04, 2009 @ 05:52:42

  మీకూ మీ కుటుంబానికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఏప్రి 04, 2009 @ 07:42:02

  ఆత్రేయ గారికి, మల్లిన వారికి
  ధన్యవాదాలు… శ్రీరామ నవమి పర్వ దిన శుభాభినందనలు
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 5. Amma Odi
  ఏప్రి 04, 2009 @ 08:14:10

  శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  స్పందించండి

 6. parimalam
  ఏప్రి 04, 2009 @ 08:51:25

  సర్ ! మీ “ఏక పద్య రామాయణం”బావుందండీ !
  మీకూ మీ కుటుంబానికి ….
  శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  ఏప్రి 04, 2009 @ 09:33:33

  ’అమ్మ ఒడి’, ’పరిమళం’ నిర్వాహకులకు
  ధన్యవాదాలు! ’శ్రీరామనవమి’ పర్వదిన శుభ కామనలు!
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 8. రాఘవ
  ఏప్రి 06, 2009 @ 11:59:15

  బావుందండీ ఫణీంద్రగారూ.

  కానీ నాకు కూడ మీ పద్యంలో బాలకాండమే ఎక్కువ కనబడింది.

  శ్రీమద్రామాయణసంగ్రహైకశ్లోకాలు చాలానే ఉన్నై. వాటిలో ప్రసిద్ధమైనదీ దాదాపు రామకథని మొత్తం సంగ్రహించినదీ ఇది:
  ఆదౌ రామతపోవనాది గమనం — బాల అయోధ్యాకాండలు సూచితం. తపోవనాలకి ముందు విశ్వామిత్రమహర్షితోనూ తర్వాత సీతమ్మతోనూ వెళ్లాడు అని. హత్వామృగం కాఞ్చనం వైదేహీహరణం జటాయు మరణం — అరణ్యకాండ. సుగ్రీవసంభాషణం వాలీ నిగ్రహణం — కిష్కింధాకాండ. సముద్రతరణం లంకాపురీదాహనం — సుందరకాండ. పశ్చాత్ రావణకుంభకర్ణహననం — యుద్ధకాండ. తు ఏతత్ హి రామాయణమ్.

  నమస్సులతో
  రాఘవ

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  ఏప్రి 06, 2009 @ 23:00:17

  రాఘవ గారు! ధన్యవాదాలు.
  మీరన్నది నిజమే. కానీ, ’బాల కాండ’నే పండితులు ’బాల రామాయణం’ గా వ్యవహరిస్తారు. అంటే, క్లుప్తంగా చెప్పవలసివచ్చినపుడు అదే ప్రధానమైనదని భావించవచ్చు. పైగా, సంపూర్ణ రామాయణాన్ని సేవించే అవకాశం లేనప్పుడు, ’కల్యాణం’ వరకు సేవిస్తే, ఆ ఫలం దక్కుతుందన్న నమ్మకం కూడ తెలుగు నాట ఉంది. అంతే కాకుండా, “తండ్రి వచః పరిపాలనన్” రాముడు అడవులకు వెళ్ళింది, రాక్షస సంహారం కోసమే – అన్న మూల తత్త్వాన్ని గ్రహించినప్పుడు మధ్యలో వచ్చే ఘటనలు, పాత్రలు అన్నీ నిమిత్త మాత్రమైనవే. ఏ సీస పద్యమో ఎత్తుకొంటే, మీరన్న ఘటనలన్నీ పొందుపరచవచ్చు. వృత్త పద్యంలోనే వ్రాయాలనుకొన్నప్పుడు, మీరు చెప్పిన శ్లోకంలా జననం నుండి వనవాస ఘట్టం వరకు “రామ తపోవనాది గమనం” అని ఒక్క మాటలో చెప్పి, మిగితా విషయాలను వివరంగా చెప్పడం నాకు సమంజసంగా అనిపించలేదు. మరొక విషయం గమనించారా? ఆ శ్లోకంలో ఘట్టాల పేర్లను ముక్కలు ముక్కలుగా పేర్చారే తప్ప, నా పద్యంలోలా కథా గమనంతో కూడిన వాక్య నిర్మాణం లేదు.
  – డా. ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 10. raghu
  అక్టో 03, 2009 @ 11:24:23

  cluptanga ramayana kathanu rachinchagalaru

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: