“విరోధి”

’విరోధి’
———–
– రచన: ” పద్య కళా ప్రవీణ”
డా.ఆచార్య ఫణీంద్ర
——————————–
ugadi-image-1htm3

రావె ’విరోధి’ నామ రస రమ్య నవాబ్దమ! నీదు నామ ము
ద్రే విని, గుండెలం గలిగె నేదొ భయమ్మది మా ప్రజాళికిన్!
నీవటువంటి దానవని నేను తలంపను – దుష్ట శక్తికిన్
నీవ ’విరోధి’వై నిలిచి, నిండు శుభమ్ముల నీయ రా త్వరన్!

కుసుమ కోమలంబగు ఆడ కూతురులకు
మోముపైన పైశాచికంబుగ జరిపిన
యాసిడుల దాడి సంస్కృతి కయి ’విరోధి’ –
పడతి నాదరించు సుగుణ పథము నిమ్ము!

’సత్య’ మసత్యమై, తెలుగు జాతి మహోన్నత కీర్తి, గౌరవా
లత్యతి హేయమైన గతి అట్టడుగుం బడిపోవ – కారణం
బత్యధికాశ, పాలనమునం దవినీతి గదా! ’విరోధి’వై
నిత్యము వానికిన్ – తెలుగు నీతిని, జాతిని కావుమా ఇకన్!

కణచిన వత్సర మంతయు
వణికించిన యట్టి ఉగ్ర వాదమ్మునకున్
నిను నే తలతు ’విరోధి’గ!
గుణపాఠము నేర్పు ’పాకు’ గూండాగిరికిన్!

ఎన్నికలగు వేళ ఏతెంచితివి నీవు –
ఈ అమాయిక ప్రజ కెట్టి హాని
సలుపకుండ, సత్ప్రజాస్వామ్య పాలక
విమల పక్షమునకు విజయమిమ్ము!

(విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లియున్న తెలుగు వారందరికీ
’విరోధి’ నామ సంవత్సర ’యుగాది’ పర్వదిన
శుభాకాంక్షలతో – )

—***—

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. mallina rao
  మార్చి 26, 2009 @ 05:24:50

  విరోధి లోని విరోధాభావాన్ని పరిహరించి చక్కని కవిత నందించారు. హార్దిక శుభాభినందనలు.

  స్పందించండి

 2. భాస్కర రామిరెడ్డి
  మార్చి 26, 2009 @ 08:14:56

  ఆచార్యా !
  యాసిడ్ దాడులను, సత్యం స్కాములను,వుగ్రవాద యుద్ధాలను దేన్నీ వదలకుండా గడచిన సంవత్సరానికి విరోధివికమ్మని చాలా హృద్యంగా చిన్న చిన్న మాటలతో ఆహ్వానించారు. మీ పద్య లాలిత్యాన్ని ఆలకించైనా సరే “విరోధి” సజ్జనుల పట్ల లలితంగాను, దుర్జనుల పట్ల విరోధి గాను వుండాలని కోరుకుంటూ..ఉగాది శుభాకాంక్షలు.

  స్పందించండి

 3. రవి
  మార్చి 26, 2009 @ 15:34:55

  చాలా భావయుక్తంగా చెప్పారు.

  విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు, శుభకామనలు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మార్చి 26, 2009 @ 18:15:02

  సహృదయులు, సత్సాహిత్య ప్రియులు
  శ్రీ మల్లిన వారికి, శ్రీ భాస్కర రామిరెడ్డి గారికి, శ్రీ రవి గారికి –
  ధన్యవాదాలు – విరోధి నామ నవ వర్ష శుభాభినందనలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 5. ఆత్రేయ
  మార్చి 26, 2009 @ 20:34:39

  ఆచార్యా మీకు మీ కుటుంబానికి విరోధి నామ వత్సర శుభాకాంక్షలు

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  మార్చి 26, 2009 @ 20:47:04

  మధుర భావుకులు ’ఆత్రేయ’ గారికి
  ధన్యవాదాలు –
  మీకు, మీ కుటుంబ సభ్యులకు
  ’విరోధి’ నామ నవ యుగాది శుభాకాంక్షలు!
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: