“ఏక వాక్య కవితలు”

“ఏక వాక్య కవితలు”
———————————–
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

తెలుగు సాహిత్యంలో నేను ప్రవేశపెట్టిన వినూత్న ప్రక్రియ – “ఏక వాక్య కవితలు”.
2004వ సంవత్సరం మార్చి నెలలో 252 ఏక వాక్య కవితల సంపుటిని “వాక్యం రసాత్మకం” పేరుతో గ్రంథంగా వెలువరించడం జరిగింది. దివంగత విమర్శకాగ్రేసరులు ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆవిష్కరింపబడిన ఈ గ్రంథం పలువురు సాహితీ ప్రియులు, సాహితీ వేత్తల ప్రశంసలనందుకొంది. అదే సంవత్సరం ఇది ’విజయవాడ’ లోని ’ఎక్స్-రే’ సంస్థ వారిచే ’ఉత్తమ కవితా పురస్కారం’తో సత్కరించబడింది.
ఈ గ్రంథానికి పీఠిక వెలయించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. అద్దేపల్లి రామమోహన రావు “ఒకేఒక్క వాక్యంలో కవిత్వ స్ఫురణ కలిగించడం ఒక మంచి ప్రయత్నమే. ఆ ప్రయత్నం మొదటిసారిగా చేసి, 252 వాక్యాలతో “వాక్యం రసాత్మకం” అనే సంపుటిని ప్రచురిస్తున్నారు ఆచార్య ఫణీంద్ర. ఆచార్య ఫణీంద్ర తన ఏక వాక్య కవితలలో అనేక విధాలైన వస్తువులను తీసుకొన్నారు. అనేక విధాలైన అభివ్యక్తులను అనుసరించారు. సౌందర్య వర్ణన నుండి తాత్వికత దాకా ఆయన ఆలోచనల పరిధి ఈ సంపుటిలో విస్తరించింది. బాహ్య చమత్కృతి నుండి, లోతైన అభివ్యక్తి దాకా ఆయన రచనా శైలి పరుచుకొని ఉంది.” అని కితాబు నిచ్చారు.
“Indian Express” ఆంగ్ల దిన పత్రికలో శ్రీ గోవిందరాజుల రామకృష్ణారావు ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ ” Author of the book ‘VAAKYAM RASAATMAKAM’, Dr.Achaarya Phaneendra experiments by adopting a sentence as a unit for poetry. The subjects are varied. Each poem has a flash in it. The book is a delight for the lovers of new form of poetry.” అని ప్రశంసించారు.

ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు మచ్చుకు కొన్ని ఆస్వాదించండి.

* అక్షరాలు సంగమించి అర్థాన్ని ప్రసవిస్తాయి.

* హృదయం కదిలింది- కళ్ళ నుండి నీళ్ళు బొటబొటా !

* తన్నినా లాలించింది- తల్లి కదా!

* బాల్యంలో తల్లిపై, యవ్వనంలో భార్యపై, వృద్ధాప్యంలో కోడలిపై ఆధారపడే మగాడు ఆడదాన్ని అబల అంటాడేమిటి?

* ఆ కవి ఎన్ని రాత్రులను మింగాడో, పగలు సూర్యునిలా వెలుగుతున్నాడు.

* ఆ కుడ్య చిత్రం ఒక మౌన కవిత!

* బుగ్గపై సొట్ట – నవ్వు పువ్వు నెవరైనా కోసుకొన్నారేమో!

* పువ్వుల గుత్తులను కొమ్మలతో పట్టుకొని, నాట్య భంగిమలో నిలుచుంది తరువు.

* పడుకొన్నవాడు లేచి, తిరిగి, మళ్ళీ పడుకోడమేగా జీవితం.

* జీవితాంతం దేని గురించి పరుగెత్తావో, జీవితాంతంలో అది నీది కాదు.

* నింగిని, నేలను నీళ్ళ దారంతో ఒక్కటిగా కుట్టే దర్జీ – సముద్రుడు.

* కళ్ళ కిటికీల గుండా మనసు తొంగి చూస్తుంది.

* శిల్పి కల శిలలో ప్రతిఫలించింది.

* మట్టి మనిషవుతుంది; మనిషి మట్టవుతాడు.

* నడుము తీగపై నాభి మొగ్గ!

* జీవితం – బ్లాక్ అండ్ వైట్ చిత్రం.

* కవి నా నామధేయం; నా కావ్యమే నా పరిచయం.

* ప్రేమించాను – త్యాగం నా భాష!

* వెచ్చదనం విలువ కన్నీటి నడుగు –

* భూమిపై మూడు పాళ్ళు నీళ్ళు, ఒక పాలే నేల- తరతరాల నుండి తాడిత, పీడిత ప్రజలెంత ఏడ్చారో?

* నీ కోసం జీవిత కాలం నిరీక్షించే ప్రేయసి- మృత్యువు!

* అవిశ్రాంత శృంగార సంగ్రామం- అందం చెమటలో తడిసిపోతోంది.

* ఆ చెట్టు కొమ్మలు మండుతున్నాయి అగ్ని పూల శిఖలతో!

* వెళుతున్నా- నా ముద్ర నీపై వదలి

* వాక్యం రసాత్మకం- ఉద్గ్రంథాలెందుకు?

—***—

ప్రకటనలు

35 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఆత్రేయ
  మార్చి 17, 2009 @ 02:55:12

  చాలా బాగున్నాయండి.. ఈ క్రింద చెప్పిన నా కవితలు చూసి మీ అభిప్రాయాన్ని
  తెలుప గలరు.

  http://aatreya-kavitalu.blogspot.com/2009/03/blog-post_14.html

  http://aatreya-kavitalu.blogspot.com/2009/03/blog-post_12.html

  http://aatreya-kavitalu.blogspot.com/2009/03/jaare-bhaavaalu.html

  http://aatreya-kavitalu.blogspot.com/2009/03/blog-post_10.html

  ధన్యవాదాలు

  స్పందించండి

 2. Bhaskara Rami Reddy
  మార్చి 17, 2009 @ 03:00:20

  ఫణీంద్ర గారు,
  ఒక్కోక్క వాక్యం ఒక్కోక్క సంహిత.ఎంతబాగా మాల కట్టారండి.

  స్పందించండి

 3. సురేష
  మార్చి 17, 2009 @ 08:18:14

  ఫణీంద్ర గారు

  మీ ఏక వాఖ్య ప్రక్రియ చాలా చక్కగా ఉన్నది.

  సురేష

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మార్చి 18, 2009 @ 05:14:38

  ధన్యవాదాలు సురేశ్ గారు!
  ధన్యవాదాలండి భాస్కర రామిరెడ్డి గారు!
  – డా|| ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  మార్చి 18, 2009 @ 05:18:38

  ఆత్రేయ గారు!
  ధన్యవాదాలు. తప్పకుండా మీ కవితలు చదివి నా అభిప్రాయాన్ని అందిస్తాను – డా|| ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 6. MAHADEVA SASTRY
  మార్చి 20, 2009 @ 18:22:09

  ‘ఏక వాక్య కవిత” ప్రయోగాల ఫణీంద్ర…. వ్యాపించు ఈ ప్రక్రియ యావత్ ‘ఆంధ్ర

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  మార్చి 20, 2009 @ 19:28:13

  శాస్త్రి గారు!
  మీ అభిమానానికి ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 8. aswinisri
  మార్చి 26, 2009 @ 19:37:31

  కవి మది నక్షరము–అని తెల్పుచున్నవి మీ ఏక వ్యాఖ్య కవితలు. బాగున్నాయండీ!

  స్పందించండి

 9. aswinisri
  మార్చి 26, 2009 @ 20:09:34

  కవి మది అక్షరము,–ఇలా టైపు చేస్తే అలా పడింది.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  మార్చి 26, 2009 @ 20:38:48

  అశ్వినిశ్రీ గారూ!
  బహు కాల దర్శనం –
  ధన్యవాదాలండీ!
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 11. patanjali
  మార్చి 28, 2009 @ 07:14:08

  నమస్సులు.
  మీ బ్లాగ్ బాగుంది.
  ఏక వాక్య సంయోజనలో కవితావిష్కరణ ప్రయోగం అభినందనీయం.
  -డా.తాడేపల్లి పతంజలి

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  మార్చి 28, 2009 @ 07:37:36

  పతంజలి గారికి నమః
  ధన్యవాదాలు!
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 13. lakshmiprabha
  మార్చి 31, 2009 @ 22:16:43

  namasthe
  vakyam rasatmakam -the coinage is justified in your beautifully short expressions.

  స్పందించండి

 14. Dr.Acharya Phaneendra
  ఏప్రి 01, 2009 @ 00:03:09

  Laxmi Prabha garu!
  Thanks a lot

  స్పందించండి

 15. nutakki raghavendra rao
  ఏప్రి 21, 2009 @ 20:06:09

  ఆచార్యా,
  జీవితానికి ముందెలాగో నీవు లేవు
  జీవితాంతంలో నైనా నిన్ను నీవు మిగుల్చుకో
  అని ఒక సందర్భంలో నేను
  వ్రాసిన మాటలు గుర్తుకొచ్చాయి,
  మీరు వ్రాసిన ఆ కవిత చదివి …

  “జీవితంలో దెనికోసం పరిగెత్తావో
  జీవితాంతంలో అది నీది కాదు….జీవిత వాస్తవం.

  మరొ పద కవితలో

  ‘తాడిత పీడిత ప్రజలు ‘
  అన్న దానిని కన్న ‘జీవులు ‘
  అనివుంటే నో ….
  ఆక్షరాలు సంగమించి
  అర్ధాలను ప్రసవిస్తాయి. సాహితీ ప్రక్రియకు స్పూర్తినిచ్చే ఓ నూత్న ప్రయోగం.
  అభినందనలతో…..నూతక్కిరాఘవేంద్ర రావు.

  స్పందించండి

 16. Krishnamurthy
  మే 17, 2009 @ 12:27:35

  mee kavithu chala bagunnavi Paneedra garu vakya oka kavitha eela inka chala kavithalu vrayali

  స్పందించండి

 17. Vinay
  జూన్ 14, 2009 @ 22:49:04

  Telugu theyyadanam parimalalalo olaladinchina meeku ede na namassumanjali.

  స్పందించండి

 18. Dr.Acharya Phaneendra
  జూన్ 14, 2009 @ 22:59:43

  నూతక్కి వారికి , కృష్ణ మూర్తి గారికి , వినయ్ గారికి
  అనేక ధన్యవాదాలు !
  _ డా || ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 19. Usha
  జూన్ 15, 2009 @ 04:22:12

  దుర్లభమే అయినా అసాధ్యం కాదేమోనండి. కొన్ని నాకు బాగా నచ్చాయి. అయినా ఈ ప్రక్రియలో కొంత భాషమీద పట్టు,అవగాహనతో పాటు ఇందులోని పరిమితినీ గ్రహించుకోవాలి కదండీ? నానోలు మాదిరే ఇదీ నూతనంగావుంది. అభినందనలు. మునుపెపుడొ ఓ మారు మరువాన్ని చూసారు, మళ్ళీ వచ్చారా నా వన విహారానికి?

  స్పందించండి

 20. Dr.Acharya Phaneendra
  జూన్ 15, 2009 @ 08:02:20

  ఉష గారికి నమః
  కృషి చేస్తే అసాధ్యమేమీ కాదు. నేను ప్రొద్దున ఫ్రెష్ మైండ్ తో మార్నింగ్ వాక్ చేస్తూ రోజుకు నాలుగైదు మాత్రమే చిక్కగా వచ్చేవరకు ఆలోచించి, ఇంటికి వచ్చాక వ్రాసుకొనే వాణ్ణి. అలా 252 అయ్యాక గ్రంథంగా వేసాను. అయినా 100 శాతం ఫలితం రాబట్టడం కష్టమే కదా! ఏదేమైనా , గ్రంథానికి మంచి గుర్తింపు రావడం చాలా సంతృప్తి నిచ్చింది. ఇప్పుడు ప్రొఫెసర్ ఐ. వి. చలపతి రావు గారు దీనికి ఆంగ్లానువాదం రూపొందించారు. వచ్చే నెలలో గ్రంథావిష్కరణ చేసే పనుల్లో బిజీగా ఉన్నాను. కాస్త తీరుబడి అయ్యాక మీ మరువం పరిమళాళను తప్పక ఆస్వాదిస్తాను. ఒక మంచి రచయిత్రిగా మీరంటే నాకు చాలా గౌరవం.

  _ డా || ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 21. Usha
  జూన్ 15, 2009 @ 08:48:27

  డా || ఆచార్య ఫణీంద్ర గారు, ఆదరపూరితమైన మీ అ చివరి పలుకులకి నాకెంతో ముదావహం. ఆంగ్లానువాదానికి మరోసారి అభినందనలు.

  స్పందించండి

 22. ravindra nadh
  డిసెం 01, 2009 @ 14:31:47

  chala bagunnai ,,,,,me kavitalu

  స్పందించండి

 23. Vicky
  జూన్ 29, 2010 @ 23:48:41

  Chala bagunnai.

  స్పందించండి

 24. Dr.Acharya Phaneendra
  జూన్ 30, 2010 @ 08:26:25

  రవీంద్రనాథ్ గారికి
  విక్కీ గారికి
  ధన్యవాదాలు !

  స్పందించండి

 25. Gourimahesh Nadella
  అక్టో 23, 2010 @ 15:28:01

  Chaala Baagunnai.

  స్పందించండి

 26. potukuchi taraka phanindra sarma
  ఫిబ్ర 12, 2011 @ 01:37:29

  meeru vrasina kavitha nee kosam jeevithakalam nireekshinche preyasi mrutyuvu annaru , a okkapadam tho nenu jeevitamlo marachipolekapotunna nannu prminchina { mosaginchina } naa preyasini marachipoyi jeevitamlo hayiga untunnanu , meeku dhanyvaadalu ,

  స్పందించండి

 27. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 12, 2011 @ 19:03:11

  నాదెళ్ళ గౌరీ మహేశ్ గారికి
  ధన్యవాదాలు!
  తారక ఫణీంద్ర శర్మ గారు!
  లోగడ శ్రీశ్రీ గారి “కల కానిది.. నిజమైనది..” అన్న గీతాన్ని విని, ఆత్మహత్యకు పూనుకొన్న ఒక వ్యక్తి ఆ ప్రయత్నాన్ని మానుకొన్నాడట. ఈ రోజు మీ వ్యాఖ్య చూసినాక అది గుర్తుకు వచ్చి ఎంతో ఆనందించాను. ఎన్నో కవితలు వ్రాస్తుంటాం. ఎన్నెన్నో ప్రశంసలను, సత్కారాలను పొందుతుంటాం. కాని మీ ప్రశంస నా జీవితంలోనే ప్రత్యేకమయినదిగా నిలిచిపోతుంది. ఈ రోజు నా జీవితమే ధన్యమైందని భావిస్తున్నాను.
  “ఏక నామం సదా ప్రీతి” అంటారు. కాకతాళీయంగా మన పేర్లు కూడా ఒక్కటి కావడం మరింత ఆనందాన్నిచ్చింది.
  మీ భావి జీవితం ఇక ఆనందమయమై, మీకు సకలైశ్వర్య విజయాలు సంప్రాప్తించాలని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాను.

  స్పందించండి

 28. nlreddy
  మార్చి 03, 2011 @ 15:24:59

  challa challa bagunnai

  స్పందించండి

 29. Dr.Acharya Phaneendra
  మార్చి 06, 2011 @ 09:50:53

  nlreddy garu!
  Thank you very much!

  స్పందించండి

 30. SUDHEER KUMAR
  డిసెం 23, 2011 @ 21:35:15

  velakattakattleni vakyala harivillukada idhi

  స్పందించండి

 31. Kaleswara Rao
  జన 26, 2012 @ 18:39:31

  Sri Phaneedra Garu

  kasta manasu bagoleka telugu kavitalu clicks chesa, me kavitalu chusaka

  me Eka vakya kavitalu – manasuki manchi kick la panichesayi
  Thanks
  Kali

  స్పందించండి

 32. sai prakash
  సెప్టెం 11, 2012 @ 13:12:38

  meevi kavitalaa? sookthulaa?

  స్పందించండి

 33. Dr.Acharya Phaneendra
  సెప్టెం 11, 2012 @ 20:21:11

  సాయి ప్రకాశ్ గారు!

  “ఆ కుడ్య చిత్రం ఒక మౌన కవిత!”
  “నింగిని, నేలను నీళ్ళ దారంతో ఒక్కటిగా కుట్టే దర్జీ – సముద్రుడు.”
  “కళ్ళ కిటికీల గుండా మనసు తొంగి చూస్తుంది.”
  “నడుము తీగపై నాభి మొగ్గ!”
  ———————–
  ————————-

  ఇవన్నీ సూక్తులా? కవితలా?

  స్పందించండి

 34. Himakara (himmatraopeta kailasapathi Rao
  అక్టో 16, 2012 @ 21:10:15

  Manasunu dochukunevi Malle pulu-mee kavitalu

  స్పందించండి

 35. Dr.Acharya Phaneendra
  అక్టో 16, 2012 @ 22:45:18

  Many many thanks Himakara garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: