“ఫుట్ బాల్” [పద్య కవిత]

“ఫుట్ బాల్” [పద్య కవిత]
——————————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర

images

అంత మర్రిచెట్టు నింతలో ఒదిగించు
’బోనుసాయి’ రకపు మొక్క వోలె –
పోల్చుకొనరె నన్ను? ’ఫుట్ బా’లనెడి నేను
ఉర్వి గోళమునకు నొక ప్రతీక!

విశ్వపతి యాడు క్రీడలో వెలసి, వసుధ
నరుల పద ఘట్టనల క్రింద నలిగినట్లు –
మనుజులాడు నీ ’ఫుట్ బాలు మ్యాచు’నందు
నన్ను నాటగాళ్ళును త్రొక్కి, తన్నుచుంద్రు!

పాపమొ? శాపమో? మరిది ప్రాప్తమొ గాని ఎరుంగ లేను – నన్
పాపమటంచు జూడరయొ! భండన భీముల యట్లు క్రీడలో
చూపరులెల్ల మెచ్చ, తగ జూపుచు స్పర్థయె, ఆటగాళ్ళు నా
రూపము మాసి పోవునటు – క్రోధము మీరగ తన్నుచుందురే!

అరె! పదకొండు మంది ఇటు, నట్లె యటున్ పదకొండు మందియా?
మరి, ఇరు వర్గముల్ నిలువ, మధ్యన – నేనిటు లొక్క దానినా?
ఇరువది రెండు మంది ఇటు లిష్టము వచ్చిన యట్లు తన్నుటా?
కరువది ఏమి వచ్చెనొ? ఒకండొక బంతిని తన్న రాదొకో?

కొందరు నీ మూలకు, మరి
కొందరు నా మూలకు, నను కొనిపోవుటకై –
ముందరి కాలను తన్నుచు
చిందర వందరను చేయ చిత్తయిపోదున్!

నలుబది నిముషము లటు నిటు
విలవిల లాడంగ తన్ని, విశ్రాంతి నిడన్ –
అలుపది తీరక మునుపే,
నలుబది నిముషములు మరల నా గతి యంతే!

బలి పశువట్లు జేసి నను బాది పదమ్ముల రెండు వర్గముల్
కలకల మెంతొ రేప – అది కాంచుచు పెద్ద మనీషి యొక్కడున్
గెలుపును నిర్ణయించునట! క్రీడన నిద్దియె? గుండె లేదె? నా
కలతను కాంచలేనియెడ కారిక పెద్ద యతండు, మీరునున్!

—***—

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  మార్చి 11, 2009 @ 05:43:57

  పుష్ప విలాపాన్ని గుర్తుకు తెచ్చారండి. వేల వేల ధన్యవాదాలు.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  మార్చి 11, 2009 @ 09:45:49

  మల్లిన నరసింహారావు మహిత హృదయ!
  పుష్పముల విలాపముతోడ పోల్చి, నాదు
  కవిత కందించినా రెంతొ గౌరవమును –
  అమిత ధన్యవాదాంజలు లందుకొనుము!

  స్పందించండి

 3. padmarpita
  మార్చి 11, 2009 @ 11:29:11

  హాట్స్ హాఫ్…..

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మార్చి 11, 2009 @ 12:16:59

  Thank you very much Padma garu !

  స్పందించండి

 5. Satyanarayana
  మార్చి 11, 2009 @ 16:17:49

  బాగుందండి.
  “కరువది ఏమి వచ్చెనొ? ఒకండొక బంతిని తన్న రాదొకో?” – జాలితో పాటు నవ్వుకూడ పుట్టించింది.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  మార్చి 11, 2009 @ 16:46:42

  జిగురు వారి స్పందనకు
  ధన్యవాద పూర్వక అభివందనాలు
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 7. MAHADEVA SASTRY
  మార్చి 12, 2009 @ 15:59:02

  తను పప్పై…ఒక వర్గానికి కప్పైన బాలుపై జాలిగ, వీలుగా మేలైన మీకవిత బలెబాగు….

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  మార్చి 12, 2009 @ 19:29:19

  శాస్త్రి గారు!
  ప్రతి కవితను చదివి, మీ స్పందనను తెలియజేస్తూ, నా బ్లాగుపై అభిమానాన్ని చూపుతున్నందుకు ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: