ఎన్నికలలో ఎన్ని కలలో!

evm-photo2

———————————–
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
————————————

ఎన్నికలలో ఎన్ని కలలో!
ఎన్ని కలలో! ఎన్ని కలలో!

దిక్కు తోచని తమను గాచే
చక్కనైన ప్రభుత కోసం
బక్క చిక్కిన బడుగు ఓటరు
కెన్ని కలలో ఎన్నికలలో!

ధనికులకు తమ లాభములకే
దమ్మునిచ్చే పాలసీలను
అమలుపరిచే ప్రభుత కోసం
ఎన్ని కలలో ఎన్నికలలో!

ప్రచారానికి పైసలిస్తే
పదో వంతే ఖర్చు చేసి,
మిగతా మ్రింగ, కార్యకర్తల
కెన్ని కలలో ఎన్నికలలో!

ఓటు ఓటుకు విలువ గట్టి
నాటు సారా కుమ్మరించి
పోటీలో గెలువగా నేతల
కెన్ని కలలో ఎన్నికలలో!

ఖర్చు పెట్టే ప్రతి పైసాకు
హెచ్చు రెట్లార్జింప, నేతకు
మంత్రి పదవే దక్కవలెనని
ఎన్ని కలలో ఎన్నికలలో!

ఉన్న పదవులు ఊడకుండా
ఎన్ని మార్లని చూడకుండా
మరల విజయం కోరు మంత్రుల
కెన్ని కలలో ఎన్నికలలో!

’వితుడ్రా’ చేసుకొంటే
విత్తమేదో దొరుకుతుందని
గాలివాటం క్యాండిడేటుకు
ఎన్ని కలలో ఎన్నికలలో!

విపక్షంలో ఉండి ఉండీ
విసుగు చెందిన పార్టీలకు
పాలనా భాగ్యమ్ము కోరి
ఎన్ని కలలో ఎన్నికలలో!

ఎన్ని కలలో! ఎన్ని కలలో!
ఎన్నికలలో ఎన్ని కలలో!!

(’ఈనాడు’ దినపత్రిక – 09-04-1996 నాటి సంచికలో ప్రచురితం)

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. prasad
  మార్చి 05, 2009 @ 02:26:04

  ’వితుడ్రా’ చేసుకొంటే
  విత్తమేదో దొరుకుతుందని

  Excellent writeup.

  స్పందించండి

 2. mallina rao
  మార్చి 05, 2009 @ 05:51:13

  బాగుందండి.
  ఏ పార్టీ వాళ్ళెంతిచ్చినా
  ఏ పార్టీ వాళ్ళంతపోసినా
  తిని, తాగి, చివరకు తనకు
  నచ్చిన వాడికే ఓటేసే
  ఓటరుకీ కలలుంటాయి
  ఎన్ని కలలో ఈ ఎన్నికలలో

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  మార్చి 05, 2009 @ 18:44:15

  ప్రసాద్ గారికి, మల్లిన రావు గారికి ధన్యవాదాలు
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 4. MAHADEVA SASTRY
  మార్చి 08, 2009 @ 15:06:44

  అయ్యా ఫణీంద్ర గారు…
  మీ ‘ఎన్నికలలో’ భవిష్యత్తు కనిపిస్తోంది
  భయం కనిపిస్తోంది!
  ఆశ కనిపిస్తోంది,
  ఆశయం కనిపిస్తోంది!
  అన్నింటికి మించి మీశైలి కనిపిస్తోంది,
  లంచగొండితనానిని మీ కేక వినిపిస్తుంది
  అన్నట్టుగ వుంది!
  అందుకే బాగుంది.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  మార్చి 09, 2009 @ 10:08:15

  శ్రీ మహదేవ శాస్త్రి గారికి నమః
  కవిత నచ్చి స్పందనను తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: