అంబుధులను దాటి…{పద్య కవిత}

ar-rahman2009-oscars1

అంబుధులను దాటి…{పద్య కవిత}
—————————————
రచన: ’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర
——————————————————–

’చిన్ని చిన్ని ఆశ’ చిగురించి, పుష్పించి,
’సరిగమపదనిస’ల స్థాయి పెంచి,
అంబుధులను దాటి, ’ఆస్కారు’ వేదిపై
’విజయ గీతి’ పాడి వెలిగె నిపుడు!

సంగీతంబున సాధికారికతనే సాధించి, నిష్ణాతుడై
గంగా తుంగ మహా ప్రవాహ గతులన్ కల్గించి రాగాలకున్,
పొంగారన్ సరసుల్ – మనోజ్ఞ స్వరముల్ పుట్టించి, గీతావళీ
రంగంబందున రాణ కెక్కె భువిపై ’రహ్మాను’ గంధర్వుడై!

ఉత్తర, దక్షిణము లనక –
మొత్తము భరతావని స్వర మూర్తుల యందున్
సత్తువనే చాటుచు నిలు
వెత్తుగ ఘన కీర్తి నొందె ’ఏ. ఆర్. రహ్మాన్’!

” అగునా గెల్చుట భారతీయులకు నా ’ఆస్కార్’ పురస్కారమున్?
యుగముల్ బట్టునొ? లేక లేదొ మనవా డొక్కండు కా భాగ్యమే? ” –
సెగయై రేగెడి కోరికే మది నిటున్ చేజారుచున్నంతలో –
’ద్విగుణం’బందె తొలిం బ్రయత్నముననే ధీశాలి ’రహ్మా’ నహో!

భాషయె సంగీతమనగ –
ధ్యాసయె సంగీతమనగ – తనకీ జగతిన్
శ్వాసయె సంగీతమనగ
దేశమునకు కీర్తి దెచ్చె దేదీప్యముగాన్ !

(’ఆస్కార్’ పురస్కార విజేత ’ఏ.ఆర్. రహ్మాన్’కు అభినందనలతో…)

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. దార్ల
  ఫిబ్ర 26, 2009 @ 08:17:40

  రెహమాన్‌ గురించే రాశారు. సినిమా గురించి కూడా రాసుంటే బాగుందేది. అయినా మీకూ నా అభినందనలు

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 26, 2009 @ 19:31:06

  దార్ల గారికి ధన్యవాదాలు. మనం లోగడ కొన్ని సభలలో కలుసుకొన్నాం. మీకు గుర్తుందనే అనుకొంటున్నాను.

  రహ్మాన్ మనవాడు (భారతీయుడు). అందుకే మనకు గర్వ కారణం. సినిమా నిర్మాత, దర్శకుడు మన వాళ్ళు కాదు (హాలివుడ్). అందుకే సినిమా గురించి మనం పెద్దగా గర్వించ వలసిన పని లేదు.
  ఇది ఒక భారతీయ కవిగా, రహ్మాన్ అభిమానిగా నా స్పందన.

  మీ బ్లాగును అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. మీకు కూడా నా అభినందలు.

  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 3. MAHADEVA SASTRY
  ఫిబ్ర 28, 2009 @ 16:48:42

  బలెబాగు మీ అంబుధులను దాటి
  పదప్రయోగంలో మీకెవరు పోటి?
  రెహ్మాన్ కీర్తిని ఎలుగెత్తి చాటి
  చిత్రం పేరు మరచిన మీరు చాలా…..నాటి

  అద్భుతం మీ కవిత… అత్యద్భుతం రెహ్మాన్ సంగీతం … చిత్రంలొ భారతీయుల పరిస్తితిమాత్రం దురద్రుష్టకరం.

  శాస్త్రి

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మార్చి 02, 2009 @ 19:26:36

  Sastri garu
  First of all, Thanks a lot, for your compliment.
  Secondly, I want to clarify that, it is a poem on Rehman’s victory only. It doesn’t mean that I have forgotten the name of the movie. Please refer to my explanation, given to Sri Daarla.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: