“శివాత్మకమ్”

shivatmakam

తెలుగు ప్రజలంతా తెలుసుకోవలసిన విషయమేమిటంటే –

శివాంశయే “త్రిలింగ” భాషగా రూపుదిద్దుకొన్నది.
శివాత్మకమైనది మన తెలుగు భాష!

“శివాత్మకమ్”
—————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
——————————–

నెలవంక రూపమే ’తలకట్టు’గా వెల్గె –
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె –
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –

అక్షరములౌ ఘన శివ లింగాకృతులయె
అక్షరంబులుగా ’త్రిలింగావని’పయి –
చెలువముగ నలరారుచున్ వెలుగ లిపిని,
వరలగ ’త్రిలింగ భాష’యై తరతరాలు!

[ ’శివ రాత్రి’ పర్వ దిన శుభాభినందనలతో … ]

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskara Rami Reddy
  ఫిబ్ర 23, 2009 @ 12:50:12

  ఆచార్యా ! మీ ఈ రచన ను నేను హారం లో వాడుకోడనికి మీ అనుమతి కొరకు వేచి చూస్తాను.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 23, 2009 @ 13:03:28

  భాస్కర రామిరెడ్డి గారూ!

  “శివాత్మకమ్” కవితా రచయితగా నా పేరును తెలుపుతూ ఆ కవితను ఉపయోగించుకొంటే నాకు అభ్యంతరం లేదు.

  – డా. ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 3. Bhaskara Rami Reddy
  ఫిబ్ర 23, 2009 @ 13:29:07

  కృతఙ్ఞతలు. బ్లాగుల పేజి లో కుడి వైపున మీ రచన ఉంచడమైనది.

  స్పందించండి

 4. manohar
  ఫిబ్ర 24, 2009 @ 17:10:32

  చాలాబాగుంది

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 24, 2009 @ 19:06:22

  Thank you Manohar garu !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: