“చికునుగునియ” (పద్య కవిత)

“చికునుగునియ” (పద్య కవిత)
————————————-
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
—————————————
chikungunya-virus

అకట! ఇది ఏమి వ్యాధిరొ!
“చికునుగునియ” పేర వెలసి చిచ్చును రేపెన్
సకల నగరముల యందున –
టకటకమని వ్యాప్తి చెంది ఠారెత్తించెన్!

జ్వరములెన్ని రావు – వచ్చి తగ్గియు పోవు
వైద్యుడిచ్చు మందు వాడినంత!
తెలియదాయె నిద్ది – దీని తస్సాదియ్య!
వచ్చునెపుడొ! తుదకు వదలునెపుడొ!

మందులన్ని గూడ మాట మాత్రానకే!
ముందు జాగ్రతంత ముక్తసరికె!
జ్వరము తగ్గవచ్చు! వారాలు, మాసాలు
ఒంటి నొప్పులటులె ఉండిపోవు!

మోకాళ్ళును, మోచేతులు,
ఈ కాయమునందు కీళ్ళవెంతయొ నొచ్చున్!
ఏ కార్యమతడు సలిపిన –
లోకులకది కానిపించు “స్లో మోషను”లో!

కూరుచున్నచో లేవగానేరడాయె –
నిలిచియున్నచో కూర్చుండనేరడయ్యొ!
మంచమందు ప్రక్కకు కాస్త మలగలేడు!
కలము పట్టలే, డన్నమున్ కలుపలేడు!

పట్టుకొనుచు గోడ, పాదాలు కదిలించి,
తడిమి బల్లివోలె నడువ నతడు –
కాంచువారి కద్ది “కామెడీ” చిత్రమే!
అనుభవింప – బాధ అపుడు తెలియు!

చికునుగునియ! నీదు మహిమ –
చకితుండై నక్సలైటు “సాంబ శివుండే”
ఇక అడవి నుండలేనని,
ప్రకటించియు లొంగిపోయె ప్రభుతకు – బాబోయ్!!

–***–

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskar
  ఫిబ్ర 19, 2009 @ 23:09:29

  బాగుంది ఫణీద్ర గారు.అయినా ఇప్పుడు చికె న్ గునియా అంటున్నారు, ఇండియా లో మళ్ళీ ఈ వ్యాధి ప్రబలిందా?

  స్పందించండి

 2. Bhaskar
  ఫిబ్ర 19, 2009 @ 23:10:51

  సాంబశివుడు అందుకే లొంగి పోయారా?

  స్పందించండి

 3. padmarpita
  ఫిబ్ర 20, 2009 @ 00:22:45

  చికునుగునియ వచ్చినవారు కూడా చిరునవ్వు నవ్వెదరు మీ పద్యకవితను చూచి…
  బాగు బాగు !!!!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 20, 2009 @ 00:30:37

  భాస్కర్ గారికి ధన్యవాదాలు. “సాంబశివుడు” అనారోగ్యం వల్ల లొంగిపోయానని టీ.వీ.లో స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన “చికునుగునియ” వల్ల లొంగిపోయారని ఒక బ్లాగు మిత్రుడు టపా ఉంచారు.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 20, 2009 @ 00:31:58

  Thank U Padmarpita gaaru!

  స్పందించండి

 6. Malakpet Rowdy
  ఫిబ్ర 20, 2009 @ 06:11:31

  Wow … This is creative!

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 20, 2009 @ 17:47:53

  Thank U very much dear “malakpet rowdy” garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: