“వృక్ష కావ్యం”(పద్య కవిత)

SAPA961216057190“వృక్ష కావ్యం”
——————————–
రచన:’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ఈ యనుబంధమేమొ! పరమేశ్వర కల్పిత చిత్ర సృష్టిలో
పాయక నిల్చె- మానవుని పాలిట వృక్షము తోడు నీడయై!
ఊయలయౌను వృక్ష మత డుద్భవమొందగ, వాని నూపగన్-
మోయగ పాడెయౌను కనుమూయగ, చిత్రము! వాని దేహమున్!

కూరుచుండనగును కుర్చీగ వృక్షమ్ము-
మనుజు నిద్ర కొరకు మంచమగును!
తా గవాక్షమగును- ద్వారంబు నింటికిన్-
పయనమగుట కతని బండియగును!

వంటకు మంటను కూర్చెడి
వంట చెరుకుగా దహించబడునది తానే!
మంటను వెలిగించునపుడు
అంటించగ అగ్గి పుల్ల- అదియును తానే!

శీత కాలమందు చిరు మంటలో కాలి
విశుల కిడును గాదె వెచ్చదనము!
బాటసారికి తన పయన మార్గమునందు
వేడి ఎండలోన నీడనిచ్చు!

పశువులకౌను మేత! వరి పంట పొలాల హలంబుగానగున్!
విశులకు వేవిధంబులగు విందుగ మారును- జీవ కోటికిన్
అశనము గూర్చుచుండి, ఇటులందరి కాకలి దీర్చుచుండి- తా
యశమును గాంచె వృక్ష మిలయం దగుపించెడి అన్నపూర్ణగన్!

కంటి కందమగును కనిపించి పచ్చగా-
కవికి స్ఫూర్తినిడును కవిత పొంగ!
కవిత వ్రాయుటకును కాగితంబగు తానె!
ఘనత వ్రాయ- ’వృక్ష కావ్య’మగును!

బ్రదికినన్నినాళ్ళు పండ్లు, నీడలనిచ్చి-
చంపబడిన కూడ శాశ్వతముగ
మనుజు సేవ చేయు మహితాత్మ వృక్షమ్ము
త్యాగ నిరతి వెలుగు తరతరాలు!

నాట వలయును ప్రతి నరుడొక్క చిరు మొక్క-
వృక్ష జాతి పెరుగ విరివిగాను!
ఒక్క మొక్క పెరిగి, ఉర్వి వృక్షమ్ముగా
పెక్కు లాభములను పేర్మి గూర్చు!

–***–

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. Satyanarayana
  ఫిబ్ర 04, 2009 @ 22:15:07

  అద్భుతంగా ఉంది.

  స్పందించండి

 2. chinta rama krishna rao
  ఫిబ్ర 04, 2009 @ 23:20:56

  డా. ఆచార్య ఫణీంద్రా! మీ వృక్ష కావ్యం యదార్థ దర్పణంగా పరిఢవిల్లుతోందనడంలో సందేహం లేదు.
  చక్కని భావుకత. అభినందనలు. ఈ వృక్షాలను గూర్చి నేను నా ” శ్రీ శిరిడీశ దేవ శతకంలో ” వ్రాశాను చూడండి.
  ఉత్పలమాల:-
  వృక్షము లాదిదేవతలు. వృద్ధి యొనర్చును జీవ కోటి. పల్
  పక్షుల కాకరంబు. తమ స్వార్థముతో పెకలించు వారికిన్
  చక్షు వినాశనంబగును, సద్ గుణ వర్ధన! గొల్పుమయ్య! మా
  కక్షయమైన జ్ఞానము. గుణాంబుధి! శ్రీ శిరిడీశ దేవరా!
  పునరభినందనలతో
  చింతా రామ కృష్ణా రావు.

  స్పందించండి

 3. sugandhini
  ఫిబ్ర 05, 2009 @ 16:14:19

  nadini daata navayonu ee chettu
  naava naduputaku teddu yagunu ee chettu.

  chala bagumdi mee vruksha kavyamu.

  స్పందించండి

 4. aswinisri
  ఫిబ్ర 05, 2009 @ 17:41:20

  good.

  స్పందించండి

 5. ఉష
  ఫిబ్ర 08, 2009 @ 18:26:39

  పద్యరచనల్లో నాకు ప్రవేశం లేదండి. కాని చదివి అర్థం చేసుకోగలను. చాలా బాగా వ్రాసారు. నిజానికి గోమాతని చూసినా నాకిదే భావన కలుగుతుంది, మా అమ్మమ్మ గారి పొలంలోని తాడిచెట్టు మీద నేనిదవరలో ఒక కవిత ఇదే ఆత్మతో వ్రాసుకున్నాను.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: