డా.ఆచార్య ఫణీంద్ర విరచిత వచన కవితలు – 3

అగ్ని సంస్కారం
——————
crying

అల్లారు ముద్దుగా
పెంచుకొంటున్న ’ఆశ’
అనుకోకుండా
’యాక్సిడెంట్’ లో చచ్చిపోతే
గుండె వల్లకాట్లో
కాల్చి పారేస్తున్నా!

పిచ్చి కళ్ళూ! మీరెందుకే
’ఫైరింజిన్’లను పిలిచారు?

జరుగుతున్నది
అగ్ని ప్రమాదం కాదు –
అగ్ని సంస్కారం!

–***–

’వెల’యాలు
————

మొదటి నుండీ
ఆమె కడుపుకూ, గుండెకూ
పడి చావదు

అందరిలా కాక, ఆమె
అందాల శరీరాన్ని
రోజుకొకడి కందించే
’రోలింగ్ షీల్డ్’ లా మారిస్తే –

ఆమె కడుపులో
ఆకలి మంటలు చల్లరుతాయి
ఆమె గుండెలో
ఆవేదన మంటలు రగులుతాయి

–***–

జీవిత సత్యం
—————

’నిన్న’- ఒక నిరాశల ప్రదేశం
’రేపు’- ఒక ఆశల దేశం
ఆ రెంటిపై ’నేడు’-
ఒక ప్రయత్నాల వారధి
దాని కింద వైరాగ్యాల జలధి

ఇదే – జీవిత సత్యం!
మనిషి తలపై దేవుని నృత్యం!!

–***–

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. aswinisri
  ఫిబ్ర 01, 2009 @ 13:28:23

  good.

  స్పందించండి

 2. subhadra
  ఫిబ్ర 01, 2009 @ 14:15:24

  1st kavitaa chala bagundi,migili remdu kudaa bagunai.
  meeru manchi feel to rasaru ,
  all the best.

  స్పందించండి

 3. rayraj
  ఫిబ్ర 01, 2009 @ 16:14:37

  mUdu bAvunnAyi. kAkapOtE 1 and 3 nAku naccAyi.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: