Devotional Song on Lord Venkateshwara

balaji1

ఇంతింత తిరుమణికాపు…(భక్తి గీతం)
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

ఇంతింత తిరుమణికాపు
ఎంత వైభవమగు రూపు
వేంకటపతి పై చూపు
వెనుదిరుగదు- తిరు
వేంకటపతి పై చూపు
వెనుదిరుగదు- ||ఇంతింత||

వజ్ర ఖచిత ఘన కిరీటము-
పద్మ పత్ర సమ నేత్ర ద్వయము-
అధర జనిత మధు మందహాసము-
వెరసి, కమనీయ వదన రాజము- ||ఇంతింత||

అమ్మల గన్న అమ్మలు
అలిమేల్మంగ, శ్రీ సతులు
రొమ్మున కొలువై భక్తులపై
చిమ్మెడి దివ్య కాంతులు- ||ఇంతింత||

అభాగ్య జీవుల అశాంతి బాపి
ఆత్మ స్థైర్యమిడు అభయ హస్తము-
అనంత కోటి పాతకములను
పరిహరించెడి పాద యుగ్మము- ||ఇంతింత||

నెట్టే వరకు కదలరని
తిట్టేరు ధర్మ కర్తలు-
కొట్టిన గాని కదలమని
పట్టుబట్టేరు స్వామి భక్తులు- ||ఇంతింత||

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

  1. Ramesh Katti
    జన 05, 2009 @ 20:55:42

    డా|| ఆచార్య ఫణీంద్ర గారు,

    మీరు సామాజిక విషయాల పై ఎమైనా వ్రాసారా?. అలానె మత/కుల పరమైన విషయాల పై ఎమైనా వ్రాసారా?

    అంటె ప్రజల రొజువారి స్తితి గతుల పై.

    వుదాహరణకు …
    హింవుల దేవాలయాలను, వాటి అనుబంద స్థలములను సర్కారు అనుబవిస్థుంది కదా. దీనిపై మీ అభిప్రాయము ఎమిటి?.

    స్పందించండి

    • Dr.Acharya Phaneendra
      జన 06, 2009 @ 23:06:46

      శ్రీ రమేశ్ గారికి నమః
      “Dr.Acharya Phaneendra” అన్న నా బ్లాగులో అనేక సామాజిక అంశాలపై పద్యాలున్నాయి. అలాగే నా ప్రచురిత గ్రంథాల వివరాలు, ఇంకా నా గురించి పరిచయమూ ఉన్నాయి. చూడండి.
      కం|| తీరిక గల యప్పుడు నా
      పేరున గల “బ్లాగు” చూచి, విషయము పైనన్
      మీరిటులే స్పందించుడు-
      మీరును, నేనును కవి మిత్రుల మనగాన్!
      -డా|| ఆచార్య ఫణీంద్ర

      స్పందించండి

  2. sirishasri
    ఏప్రి 20, 2009 @ 18:43:19

    mii giitaalu saraLamugaa ,
    maMchi layabaddhatatO unnavi.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: