Telugu Velugu

teluguthalli2

తెలుగు వెలుగు
– డా.ఆచార్య ఫణీంద్ర

భాష ఎయ్యది దేవభాషతో పెనగూడి
జంట నాగుల నాట్య జతులు పలికె-
భాష దేనిని యతిప్రాసలే ఒనగూడి
కవచ కుండల దివ్య కాంతులొలికె-
భాష ఎద్దానికిన్ ద్వ్యర్థి మరియు త్ర్యర్థి
సత్కావ్య నిర్మాణ సత్త్వ మమరె-
కరము నే భాషరా కర్ణాట సంగీత
వాగ్గేయ కళకయ్యె పట్టుగొమ్మ-

భాష దేనిలో అవధాన భాసుర కళ
విశ్వ భాషీయులకు నెల్ల విస్తు గొలిపె-
అద్ది నాదు తెలుగు భాష! అమృత ధార!
తెలుగు గాక ఇంకెందునీ వెలుగు గలదు?

ఒక విదేశీయుడే ఉప్పొంగి స్తుతియించె
ఇది ’ఇటాలియ నాఫ్ ద ఈస్ట’టంచు –
ఒక విదేశీయుడే ఊడిగమ్మును చేసె
జీవితాంతము, దీని ఠీవి మెచ్చి –
ఒక విదేశమునందు నుత్సవా లగుచుండె
’ఆట’,’తానా’లకై ఆట పట్టు –
ఒక దేశమని కాదు – సకలావనిని నేడు
తెలుగు భాషా జ్యోతి తేజరిల్లె –

’దేశ భాషలందు తెలుగు లెస్స’ యనుట
ప్రాత వడిన మాట – శ్రోతలార!
దేశ భాషలును, విదేశ భాషలు నెల్ల
విశ్వ భాషలందు వెలుగు తెలుగు!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: