ఒక్కటై బ్రతకాలంటూ… (విరహ గీతం)

ఒక్కటై బ్రతకాలంటూ…

(విరహ గీతం)

 రచన : డా. ఆచార్య ఫణీంద్ర 

ఒక్కటై బ్రతకాలంటూ …

ఒక్కటై బ్రతకాలంటూ 

ఒట్టు తీసుకొన్నాను -

ఒక్కటే మరిచాను -

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

నీ ఆశకు నేను శ్వాస కావాలని -

నా ఊసుకు నీవు భాష కావాలని -

మన ఇరువురి మనసు లొక్క టని

మాట తీసుకొన్నాను -

ఒక్కటే మరిచాను -

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

కాలాలు మారినా, కరిగి పోనిదై -

స్థానాలు వేరైనా, చెరగి పోనిదై -

వాడిపోని ప్రేమ మనదని 

బాస చేసుకొన్నాము -

ఒక్కటే మరిచాను -

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

ధనం ముందు ప్రేమ 

దాసోహమని అందా?

అంతస్తుల ఆరాటంలో 

ఆత్మ చంపుకొందా?

నయ వంచన జీవితానికి 

నటనలే నేర్పిందా? 

రంగుటద్దాల కోసం   

రత్న దీప మార్పిందా?                                       || ఒక్కటై  ||   

— ***—

అభిప్రాయములు (+add yours?)

  1. రసజ్ఞ
    Feb 12, 2012 @ 02:19:41

    చాలా బాగుందండీ!

    జవాబు

  2. Dr. Acharya Phaneendra
    Feb 12, 2012 @ 11:46:32

    ధన్యవాదాలండి రసజ్ఞ గారు!

    జవాబు

  3. ramnarisimha
    Feb 12, 2012 @ 15:28:31

    Sir,
    Mee kavitha chala bagundi.
    Meeku abhinandanalu.

    జవాబు

  4. Dr.Acharya Phaneendra
    Feb 12, 2012 @ 17:14:13

    Ramnarisimha garu!

    Thank you sir!

    జవాబు

  5. kastephale
    Feb 13, 2012 @ 13:58:10

    అసలుది మరిచిపోతే ఎలా సార్!!!

    జవాబు

  6. Dr.Acharya Phaneendra
    Feb 14, 2012 @ 21:38:18

    ‘కష్టే ఫలే’ గారు!
    ఒట్టు పెట్టించుకొన్నాక, మాట తీసుకొన్నాక, బాస చేసుకొన్నాక … గుర్తు పెట్టుకోదని ఎలా అనుకొంటాం సార్?
    మీకు నా ధన్యవాదాలు!

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.