పాడవే చెలి!

పాడవే చెలి! [గీతం]

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

[2003లో అనుకొంటాను - ’సిలికానాంధ్ర’ (యు.ఎస్.ఏ.) వారు అంతర్జాతీయ స్థాయిలో ’తెలుగు గేయ కవితల పోటీ’ నిర్వహించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ’న్యాయ నిర్ణేత’గా వ్యవహరించిన ఆ పోటీలో నా ఈ లలిత గీతం పురస్కారాన్ని పొందింది. నేను రచించిన వాటిలో, నాకు బాగా నచ్చిన గీతాలలో ఇది ఒకటి. ఆస్వాదించండి.]

పాడవే చెలి! తీయ తీయగ -
పరవశము నందీయగ!
పరవశము నందీయగ!!

వివిధ భాషల వెలయ జేసిన
మధుర కవితల మధువులన్నీ -
ఒక్కచో కలబోసి గ్రోలుచు
మక్కువను మది తీర్చుకొనునటు -
పాడవే చెలి! …

తీపి గొంతుక తీగ సాగుచు
హృదయ సీమల నెల్ల తాకుచు -
తాకు తాకున తన్మయత్వపు
పూల పుప్పొడి రాల జేయగ -
పాడవే చెలి! …

వేడి వేసవి వీధి సాగుచు
నీడ పట్టున నిలిచినంత -
మలయ పవనం మేను తాకిన
మధురమౌ అనుభూతి కలుగగ -
పాడవే చెలి! …

-***—

అభిప్రాయములు (+add yours?)

  1. kastephale
    జన 29, 2012 @ 18:06:12

    ఆనందంగా వుంది.

    జవాబు

  2. padmarpita
    జన 30, 2012 @ 00:27:27

    బాగుందండి

    జవాబు

  3. Dr.Acharya Phaneendra
    జన 30, 2012 @ 10:11:31

    kastephale garu!
    padmarpita garu!

    aneka dhanyavadalu!

    జవాబు

  4. రవి
    జన 30, 2012 @ 20:47:23

    చాలా బావుందండి. చక్కని రాగం కూర్చితే మంచి పాట కూడా అవుతుంది.

    అప్రస్తుత ప్రశంస: బాపు బొమ్మ – చాలా కాలం క్రితం ఈ బొమ్మను ఓ పత్రికలో చూశాను. మా అమ్మ పోలికలతో ఉండటం చూసి ఆశ్చర్యంతో ఆ పేపర్ కటింగు ను చాలా కాలం నాతో పెట్టుకున్నాను.. అదే బొమ్మ మీ బ్లాగులో రంగుల్లో చూడ్డం చాలా ఆనందంగా ఉంది.

    జవాబు

  5. Dr.Acharya Phaneendra
    జన 30, 2012 @ 21:06:00

    Thank you Ravi garu!

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.