భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!
13 జన 2012
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం

నేను చూసిన గొప్ప చిత్రాలలో ఇది ప్రత్యేకమైనది. ‘టైటానిక్‘ లాంటి చిత్రం సృష్టించడం ‘హాలివుడ్‘ కే సాధ్యం కావచ్చు. కాని “మేము మా స్థాయిలో అంతటి గొప్ప చిత్రం నిర్మించగలం-“ అని నిరూపించిన గొప్ప చిత్రం – ‘జర్నీ‘! ప్రమాదాలు .. ప్రణయాలు … అనుబంధాలు …. సమాజ సేవలు….. అన్నీ సమపాళ్ళలో కలగలిపి పండించిన రసవత్కావ్యం- ‘జర్నీ‘!!

అంతే కాదు – ఇది సామాజిక బాధ్యతను ఎత్తి చూపే చిత్రం. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం. ట్రాఫిక్ పోలిస్ విభాగం పూనుకొని ప్రజలందరికీ ఈ చిత్రాన్ని ఉచితంగా చూపాలి. ఒక ACCIDENT ఎంతో మంది జీవితాలను ఎలా దౌర్భాగ్య స్థితికి నెట్టుతుందో కళ్ళకు కట్టే చిత్రం.

రెండు బస్సుల ఢీ ..అవసరానికి తగినంత గ్రాఫిక్స్… తెలివైన చలాకీ పిల్ల- ప్రియుడు మరణిస్తే బేలగా రోదించడం … డెత్ బెడ్ పైనున్న ప్రియురాలితో- నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే నాయకుడు …. తొలిచూపుల ప్రేమ తొలి గడియలలోనే- బ్రతుకు తెల్లవారిన విద్యార్థిని ….. 15 B …… 37 G …….. చివరలో GO SLOW అన్న SIGN BOARD సందేశం …….. కంట తడి పెట్టని ప్రేక్షకులుంటారా?
మధుమతి పాత్రధారిణి నటన ..హృదయాలకు హత్తుకొనే స్క్రీన్ ప్లే … శరవణన్ దర్శకత్వ ప్రతిభ … చిత్రం చూసాక, ఆ క్షణం – ”మేము భారతీయులం” అని గర్వించిన వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొన్ని మధుర క్షణాలలో ఇదీ ఒకటి అనిపించింది. అవును – నిజం! ’జర్నీ’ – భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!
- డా. ఆచార్య ఫణీంద్ర
Like this:
Be the first to like this post.
Previous మూడు వత్సరాలు .. ముప్పది వేల వీక్షణలు … Next ఎగ్జిబిషన్ లో కవి సమ్మేళనం