10 జన 2012
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం

గత అక్టోబర్, నవంబర్ మాసాలలో సిస్టం ముందు కూర్చునే అవకాశమే చిక్కలేదు. నిన్న వర్డ్ ప్రెస్ లో నా బ్లాగు ట్రాఫిక్ విశ్లేషణ చూసాక గుర్తుకొచ్చింది – నవంబర్ మాసంలో నేను అంతర్జాలంలో ప్రవేశించి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని.
*** BELATED HAPPY BIRTHDAY TO MY BLOG ***
ఈ మూడు సంవత్సరాలలో ముప్పయి వేలకు పైగా వీక్షకులు నా బ్లాగును సందర్శించారు. అంటే సగటున సంవత్సరానికి పది వేల చూపులు నా బ్లాగుపై పడ్డాయన్న మాట.
5 డిసంబర్ 2010 నాడు ఒకే రోజు అత్యధికంగా 183 మంది నా బ్లాగును దర్శించారు. ఆ రోజు నేను ప్రచురించిన టపా – నా ’వరాహ శతకం’ కావ్యావిష్కరణ సభ విశేషాలతో కూడుకొన్నది.
జూలై 2009 నెలలో అత్యధికంగా 1840 వీక్షణలు నా బ్లాగుపై ప్రసరించాయి. ఆ మాసంలో నేను ప్రచురించిన టపాలు 14. ఆ టపాలలో నా ’వరాహ శతకం’ పద్యాలు, నేను రచించిన కొన్ని ’ఏక వాక్య కవితలు’, ’మహాకవి దాశరథి’ వచన కవిత, ’గాలి బ్రతుకులు’ హాస్య స్ఫోరక పద్యకవిత, ’మతమేదైనా.. కులమేదైనా..’ అభ్యుదయ గీతం ఉన్నాయి. వీటితోబాటు నా ’విజయ విక్రాంతి ( కార్గిల్ యుద్ధంపై దీర్ఘ కవిత )’ పై ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు అందించిన కావ్య సమీక్ష ఉంది.
2008లో నేను ప్రచురించిన టపాలు 5; ప్రసరించిన వీక్షణలు 432.
2009లో నేను ప్రచురించిన టపాలు 92; ప్రసరించిన వీక్షణలు 12243.
2010లో నేను ప్రచురించిన టపాలు 37; ప్రసరించిన వీక్షణలు 8393.
2011లో నేను ప్రచురించిన టపాలు 41; ప్రసరించిన వీక్షణలు 8879.
2012లో నేను ప్రచురించిన టపా 1; ప్రసరించిన వీక్షణలు 271.
మొత్తం మూడేళ్ళ మూడు నెలల్లో ప్రచురించిన టపాలు 176; మొత్తం వీక్షణలు 30218.
ఇక ముందు కూడ బ్లాగు మిత్రులు నన్నిలాగే ప్రోత్సహిస్తూ, నా రచనలను ఆదరిస్తారని ఆశిస్తూ …
భవదీయుడు
ఆచార్య ఫణీంద్ర