అమ్మా !
31 ఆగ 2009 అభిప్రాయములు
ఈ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి. మా అమ్మ పరమపదించి నేటికి రెండేళ్ళు పూర్తయ్యాయి.
నవ మాసాలు మోసి,
కని, కని పెట్టుకొని,
పెంచి, పెద్ద చేసి,
బిడ్డ ఎదిగి ఏం సాధించినా తానే కొండెక్కినంత సంబరపడిపోయే -
ఎంత ఎదిగిన బిడ్డడైనా ఎంత చిన్న కష్టం వచ్చినా తానే పాతాళానికి జారినంత బాధపడిపోయే -
అమ్మకు …
ఏ బిడ్డడయినా
ఏమివ్వగలడు ?
ఎంతిచ్చి ఋణం తీర్చుకోగలడు ?
కానీ …
డా. పోరెడ్డి రంగయ్య ( నల్లగొండ జిల్లావాసి ) కేవలం తన మాతృ మూర్తికే గాక 172 మంది కవులు తమ మాతృ మూర్తులకు కవితా నీరాజనాలను సమర్పించుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన
” మా అమ్మ ” అన్న గ్రంథంలో ఆంధ్ర దేశంలోని ప్రముఖ కవులందరూ తమ తమ మాతృ మూర్తులపై వ్రాసిన కవితలను పొందుపరిచి, ఎనలేని పుణ్య ఫలాన్ని సంపాదించుకొన్నారు.

ఆ గ్రంథంలో మా అమ్మపై నేను వ్రాసిన పద్యాలు …
అమ్మా !
* కన్నది ఆదిగా, ఎవరు కన్పడినన్ వివరించినావు – ” నా
పున్నమి నాడు పుట్టిన సుపుత్రుడు వీ ” డని ! ఎంతొ మోదమున్
కన్నుల వెల్గ చెప్పితివి – కాగ మెకానిక లింజనీరునున్,
మన్నన లొంద నే కవిగ, మాటికి నద్దియె ప్రస్తుతించుచున్ !
* సుకుమారుడు కష్టమ్ము
న్నొకింత ఓపడని, విఫలమొందిన; గెలువన్,
సకల సమర్థుడని పలుక –
అకళంకము నీదు ప్రేమయని తెలిసెనులే !
* నీ యారోగ్యము క్షీణమైన దెపుడో ! నీ వెట్టులో ఐననున్
చేయంబూనితి వంట ! వేరెవరికిన్ చేయూని వడ్డింపకే,
నా యొక్కండున కేలొ జాలి, దయ మిన్నంటంగ, కంచాన ఆ
ప్యాయంబొప్పగ నుంచి చేతికిడినా వన్నమ్మ దే నెర్గుదున్ !
* అమ్మా ! నీవు ముదంబు నొందితివి నేనానాడు ’ పీ. హెచ్ డి. సీట్ ’
సమ్మానంబుగ పొందినంత – మరి యే శాపంబొ ? లేవైతివే -
ఇమ్మై పూర్తయి, ’ డాక్టరేటు ’ పదమే ఏ నొందు నీ వేళలో !
చెమ్మే నిండెను నాదు కన్నులను, నా చెంతింక నీ లేమిచేన్ !
* ” అమ్మా ! ఎటులున్నది ? ” యన -
అమ్మోమున హాస మొల్కి, ” అటులే ! ” యను నీ
కమ్మని కంఠ స్వరమే
చిమ్మని చీకట్ల నెటకొ చేరిన దయ్యో !
- డా. ఆచార్య ఫణీంద్ర
Single Sentence Delights
30 ఆగ 2009 అభిప్రాయములు
నా ’ వాక్యం రసాత్మకం ’ అనే ’ ఏక వాక్య కవితల సంపుటిని ఇటీవల ప్రొఫెసర్ ఐ. వి. చలపతిరావు గారు [ Former Registrar, Central Institute of English & Foreign Languages ] మరియు శ్రీ జి. రామకృష్ణారావు గారు[ Former Director of Translations, Govt. of A.P. ] కలసి, ఆంగ్లంలోకి Single Sentence Delights పేరిట అనువదించారు.
ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు …
Telugu Poet Dr. Acharya Phaneendra’s
” VAKYAM RASATMAKAM ” in Engish
” Single Sentence Delights “
[ Part 1 ]
* Alphabets conjoin and meaning is born.
* Two lives .. three knots … four witnesses …. marriage unites.
* It is the eyes that see and it is the heart that experiences.
* Heart moves – tears trickle down.
* I am leaving, leaving my imprint on you.
* Cot is the mother that puts one to sleep in her lap.
* Life is a black and white picture with delights and disasters.
* A tiny box turns the whole house into chaos.
* The earth carries the past history as a cemetery.
* Like a monkey, mind is fickle.
* I am in love and my language is ‘ sacrifice ‘.
* How did mother earth get guts and fortitude to carry mountains on its bosom.
* Eyes are the windows, the mind peeps through.
* That fresco is a silent poem.
* Dowry is a bribe given to the groom for living with him for his happiness.
* The moon is a lover tirelessly turning around the beauty queen, the earth.
* Ask the tears to tell about the worth of warmth.
* I’m genteel, still stones are pelted on me.
* Life is a kite in the sky of society.
* Cool breeze whispers and calm body feels jubilant.
* Earth turning round the sun – the moon turning round the earth – an unending triangular love story.
* The sculptor’s dream is revealed in the stone.
* Container’s black colour does not darken the white milk.
* Churn life and get the butter of experience.
* I knew the taste of tears, in my very childhood.
* Soil turns into man and finally man is reduced to soil.
* Rising from sleep, moving around and back to sleep – is what life.
* Man depends on his mother in childhood and on his wife in later years and yet calls woman as weaker sex.
* Crying children grow up, make their parents cry.
* By the time the eyes opened, half the life runs out.
* Though trampled, footpath shows the way.
* Morning is the boon granted by the sun to the world.
* The bus is moving like a pregnant woman, in labor pains.
* Although crores are spent on the film, the heroine does not have enough clothes on.
* Life is man’s signature on the document of light endowed by the sun.
* Poet is my name and my poem is my visiting card.
— *** —
వర్షోపరి
28 ఆగ 2009 అభిప్రాయములు
వర్షోపరి
రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

ఉక్కు పలక నెటుల ఉత్తరించునొ యంత్ర
మురిమి, ఎగయ జిమ్మి మెరపు – లటులె
ఆకసమును చీల్చె ఆ మేఘ మాలికల్ !
కుండ పోత వాన కురిసె నపుడు ! … 1
వర్షానంతర ప్రకృతిని
తర్షముతో బయటకేగి దర్శింపగ, ఆ
కర్షించుచు సౌందర్యము –
హర్షము కలిగించె మదిని అపరిమితముగాన్ ! … 2
ఒక్కచో అగుపించె ఉరుకులెత్తుచు కొన్ని
సెలయేళ్ళు క్రొత్తగా వెలసినట్లు -
ఒక్కచో అనిపించె ఊరి బాట లెవండొ
కడు నిర్మలమ్ముగా కడిగినట్లు -
ఒక్కచో కనిపించె ఉత్తుంగ పర్వతం
బభ్యంజన స్నాన మాడినట్లు -
ఒక్కచో తలపించె మొక్కలకు మరల
ఆకుపచ్చని రంగు లద్దినట్లు -
ఒక్కచో తోచె ముత్యంబు లొక్కటొకటి
గుమ్మముల నుండి, చూర్లపై కొసల నుండి,
తరుల శాఖలం దలరు పత్రముల నుండి,
నేల జవరాలి ఒడిలోన రాలినట్లు - … 3
తోచె – నేలపై వినయంబు తోడ గడ్డి
వచ్చి పోవు వారికి తల వంచినట్లు -
వీధులం దేగు వారిపై ప్రియము మీర
చల్ల గాలులే పన్నీరు చల్లినట్లు - … 4
ప్రాత వడ్డ దెల్ల ప్రక్షాళనంబొంది
క్రొత్త దనము మరల కూడి, తోచె -
నిర్విరామ చలన నియతోర్వి యంత్రమ్ము
’ సర్విసింగు ’ నెవడొ సలిపినట్లు ! … 5
— *** —
అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం
26 ఆగ 2009 అభిప్రాయములు
అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం
8 ఆగస్టు 2009 నుండి 24 ఆగస్టు 2009 మధ్య ( మరో 16 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల వీక్షణాలు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి ( నవంబర్ 2008 ) నుండి, ఇప్పటికి మొత్తం 8000 మంది సహృదయ వీక్షకులు దానిని సందర్శించారన్న మాట !

ఈ ’ అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవ ’ సందర్భంగా, నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !
నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘ మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!
అందరూ మహానుభావులే !
అందరికీ పేరు పేరునా వందనాలు !
– డా.ఆచార్య ఫణీంద్ర
వరాహ శతకము – 4
24 ఆగ 2009 అభిప్రాయములు

ఇది నా 70వ టపా
వరాహ శతకము
( నాలుగవ భాగము )
రచన : ’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

సింహ ముఖుండునైన నరసింహ పరాత్పరు డాహ్వయంబునన్
’సింహము’ జంతు నామమది చేరిన చాలక, తృప్తి లేక, ఆ
’సింహము’ కన్న ముందు జతచేర్చియు నీ తిరునామధేయమున్
సింహగిరిన్ ’వరాహ నరసింహు’ డయెన్ గద ఓ వరాహమా! … 31
అగణిత తారకా గణిత మధ్యయనం బొనరించి, ఖ్యాతినిన్
యుగముల పూర్వమెట్లు భరతోర్వికి గూర్చె ఖగోళ శాస్త్ర భ
వ్య గురుడు శ్రీ వరాహ మిహిరాఖ్యు డటన్నను – నీదు నామమే
తగిలెను ముందు నాతనికి – దాని ఫలమ్మె గదా! వరాహమా! … 32
ఇంతటి పూర్వ సంస్కృతిని, ఇంతటి ఉన్నత వంశ కీర్తినిన్
సాంతము విస్మరించుచు, నశౌచము మేయుచు, ’మోరి’ గుంటలో
సుంత వివేకమున్ కలుగజూపక పొర్లిన ఏవగింపరే?
చెంతకు చేరి నిన్ను ప్రజ చేతురె ముద్దు? అయో వరాహమా! … 33
భాషలయందు ద్వేషయుత భావము దెల్పగ మానవాళికిన్
దూషణ శబ్ద జాలములు తోచవు – కల్గియు వేన వేలునున్!
రోషము నీకు గల్గగ, విరోధుల బూనియు నీదు పేరుతో
దూషణ సల్పుచుందు – రది దోష మటందువె? ఓ వరాహమా! … 34
ఇంతగ ఏహ్య భావనము నెల్లరి మానసమందు నిండుచో -
అంతయు నీ స్వయంకృతమె! అన్యుల నేమని లాభమేమి? నే
చింతిలుచుందు మా యువత చేష్టలు చూడగ – విస్మరించి భా
స్వంత సుసంస్కృతిట్లు, దిగజారుట నీవలె – ఓ వరాహమా! … 35
తేటగనున్న నీట నిను తెచ్చియు స్నానము పోసి, అందమున్
చాట నలంకరించి, వెదజల్ల సువాసన ’సెంటు’ పూసినన్ -
మాటికి ’మోరి’ బొర్లుటను మానవు! ” పంది యదేమెరుంగు ప
న్నీటి సువాసన ” న్న నుడి నిష్ఠుర సత్యమె – ఓ వరాహమా! … 36
తప్పును చేయు టెవ్వరికి తప్పదు _ సత్యము లోకమందునన్!
తప్పు నెరుంగ మానవులు,తప్పక మానగ పూనుకోవలెన్!
తప్పని యెంచి కూడ అదె తప్పును చేయుట ఫంకమందు నీ
వెప్పటి కట్లె మాటికిని ఈదుటె గాదటె? ఓ వరాహమా! … 37
ఈ నరజాతి బుద్ధి, మరి ఏమనుకోకుము – నీదు బుద్ధియున్,
కానగ నొక్క రీతిగనె కన్పడుచుండును! పాడు బుద్ధులన్
మానెదమంచు నప్పటికి మానసమందు తలంచి గూడ, ఆ
పై నిక సిగ్గు వీడి, అదె పద్ధతి సాగుదురే! వరాహమా! … 38
కొందరు మూడు ప్రొద్దులెది కోరిన నద్ది భుజించి, స్థూలమౌ
బొందిని పొంది, కార్యమెది పూనరు – చేయరు – అట్టి వారలన్
” పందుల మాదిరిన్ బలుపు పట్టి ” రటంచును తూలనాడ – వి
న్నందుకు నీ మనంబుకెటు లార్తియె గల్గునొ? ఓ వరాహమా! … 39
ఐనను నీకు మానసమటన్నది యున్నదొ, లేదొ గాని – ఆ
జ్ఞానము నాకు లేదు! ఒక సత్యము మాత్ర మెరుంగుదేను – నీ
మేనిని ఎండ వానలును మీద పడన్ చలనమ్ము శూన్యమే!
కానగ మాదు నేతలకు కల్గినదీ గుణమో వరాహమా! … 40
ఆశలు రేపి, మాదు విలువైన మహత్తరమైన ’ఓటు’లన్
రాశుల కొల్ది కొల్లగొని, రాజ సుఖంబుల దేలుచుండి, ఏ
కోశమునందు మా కొరకు కొంతయునైన శ్రమింపబోడు! నీ
’రాశి’యు, మాదు నేత ’గ్రహ రాశి’యు నొక్కటె! ఓ వరాహమా! … 41
ఎంతయు తిట్టిపోసినను ఒకించుక గూడ చలించబోడు – ని
శ్చింతగ కాలమున్ గడుపు చీమయు కుట్టని యట్టులింక! ఆ
సాంతము నైదు వర్షములు సాగిన పిమ్మట యంత వచ్చి, ఓ
ట్లింతయు సిగ్గు లేక, మరి ఇమ్మని వేడునులే వరాహమా! … 42
గజ ముఖ !
22 ఆగ 2009 అభిప్రాయములు

భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్
నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ
బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్
గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!
విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ
’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !
- డా. ఆచార్య ఫణీంద్ర
ఛాయా చిత్రాలలో …
20 ఆగ 2009 వ్యాఖ్యానించండి
ఛాయా చిత్రాలలో
డా. ఆచార్య ఫణీంద్ర ఏకవాక్య కవితల సంపుటి ’ వాక్యం రసాత్మకం ’ ఆంగ్లానువాదం Single Sentence Delights గ్రంథావిష్కరణ
సభా వివరాలు :
కీ.శే. వేమరాజు నరసింహారావు గారికి శ్రద్ధాంజలి :

అధ్యక్షోపన్యాసం :
ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి IAS ( Retd.)

గ్రంథావిష్కరణ :
ముఖ్య అతిథి శ్రీ పి.కె.బెనర్జీ (Gen. Manager, Nuclear Fuel Complex) చే


అంకితోత్సవం :
కీ.శే. వేమరాజు నరసింహారావు గారి తరపున వారి కుమారుడు శ్రీ వి. విజయ కుమార్ స్వీకరణ


ముఖ్య అతిథి అభిభాషణం :

అనువాదకుల ప్రసంగాలు :
1. Prof. I.V. చలపతి రావు, Former Registrar, Central Institute of English & Forein Languages

2. శ్రీ G. రామకృష్ణా రావు, Former Director of Translations, Govt. of A.P.

గ్రంథ పరిచయం :
శ్రీమతి U.V.L. ఆనంద, Times of India విలేకరిచే

గ్రంథ కర్త డా. ఆచార్య ఫణీంద్రకు సత్కారం :


గ్రంథకర్త స్పందన :

సభానంతరం ఆత్మీయులు, అభిమానులతో డా. ఆచార్య ఫణీంద్ర :

’ఈనాడు’ దిన పత్రికలో …
19 ఆగ 2009 వ్యాఖ్యానించండి
’ఈనాడు’ దిన పత్రికలో …
నా Single Sentence Delights గ్రంథావిష్కరణ సభను గూర్చి 14-08-2009 నాటి ’ఈనాడు’ దిన పత్రికలో వ్రాసిన వివరాలు ఆలస్యంగా నా చేతికందాయి. ఆ పత్రికలో Coverage ను కూడా బ్లాగు పాఠకుల పఠనార్థం సమర్పిస్తున్నాను.

’కొత్త గట్టు’ లక్ష్మీ నరసింహ స్వామి
16 ఆగ 2009 అభిప్రాయములు
’కొత్త గట్టు’ లక్ష్మీ నరసింహ స్వామి
కరీంనగర్ జిల్లా ’కొత్త గట్టు’ పుణ్య క్షేత్రంలో ’మత్స్య గిరి’ అనే కొండపై ఒక గుహలో ’శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి’ వేంచేసి ఉన్నారు. ఆ స్వామిని తనివి తీర ఆరాధించండి. కొండ క్రింద పరిసర ప్రాంతాల ప్రకృతి రమణీయ దృశ్యాలను మనసు తీర ఆస్వాదించండి.
ఆ నరసింహ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై ప్రసరించు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర


















ఆవిష్కరణ సభ విశేషాలు
15 ఆగ 2009 అభిప్రాయములు
ఆవిష్కరణ సభ విశేషాలు

నా ’ ఏక వాక్య కవితల ’ సంపుటి ” వాక్యం రసాత్మకం ” ఆంగ్లానువాదం -
” Single Sentence Delights “ గ్రంథావిష్కరణ సభ విశేషాలు :

( Courtesy : ” వార్త ” dt. 14 – 08 – 2009 )

( Courtesy : ” Indian Express ” dt. 14 – 08 – 2009 )

( Courtesy : ” ఆంధ్ర భూమి ” dt. 14 – 08 – 2009 )





